Site icon NTV Telugu

Kidney Stones : ఈ పండు తింటే కిడ్నీలో కంకరరాయి ఉన్నా కరగాల్సిందేనట

Kidney Stones

Kidney Stones

ఈ పండు తింటే కిడ్నీలో కంకరరాయి ఉన్న జరగాల్సిందేనట. అసలు కిడ్నీలోకి రాళ్లు ఎలా వస్తాయో చాలా మందికి తెలియదు. మనం నిత్యం ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. అప్పుడు మనకి తెలియకుండానే వెంట్రుకలు కంటికి కనిపించని చిన్నపాటి జీర్ణం కాలేని ఘన పదార్థాలు లోపలికి పోతాయి. అయితే అది చాలా స్వల్ప మోతాదులోనే ఉంటాయి. కడుపులోకి పోయి ఒక్కొక్కటిగా కిడ్నీలో చేరి గడ్డలలాగ పేరుకుపోతాయి. అయితే బాగా నీళ్ళు తాగే అలవాటు ఉండేవారికి ఎప్పటికప్పుడు యూరిన్‌ ద్వారా బయటకి వెళ్ళిపోతాయి. కానీ అలా చేయలేని వారి కిడ్నీల్లో ఈ ఘన పదార్థాలు పేరుకుపోతాయి. వాటిని మనం రాళ్లు అంటాం. ఇది మనం సైన్స్‌ పరంగా చెప్పాలంటే.. మన కిడ్నీలు రోజూ 700 లీటర్ల నీళ్ళు దాకా వడ పోస్తూ ఉంటాయి.
Also Read : Motion sickness Tips : జర్నీల్లో వచ్చే వాంతులను తగ్గించే చిట్కాలు

ఈ క్రమంలో వ్యర్ధ పదార్ధాలన్నీ ఒక పక్కనే చేరుతాయి. మధుమేహం ఉన్నవాళ్లు ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో విటమిన్‌ ఏ,డీ లుఎక్కువగా ఉన్న విటమిన్‌ బీ తక్కువగా ఉన్న రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. రాళ్లు ఏర్పడడానికి యూరిక్ ఆసిడ్ ప్రధాన కారణం అని కూడా వైద్యులు చెబుతున్నారు. అందుకే మాంసాహారాల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. థైరాయిడ్‌ వల్ల వేసుకునే మందులు, గ్యాస్టిక్‌ సమస్యల వల్ల వేసుకునే ద్రవపదార్థాల వల్ల కూడా రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతాయి. కిడ్నీలు రాళ్లు వచ్చినప్పుడు వెనుక భాగంలో నొప్పి వస్తుంది. అప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. లేకపోతే పెద్ద ప్రమాదం జరగొచ్చు. మన ప్రయత్న పూర్వకంగా ఇంట్లో కిడ్నీలో రాళ్లు ఎలా నివారించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Also Read : Tech Tips : మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఇలా చేయండి

చాలా మంది ఇంటి చిట్కాలతోనే ఈ సమస్యను అధికగమిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఎక్కువ నీటిని తాగాలి. రోజుకి రెండు నుండి పది లీటర్ల నీళ్ళు, ద్రవపదార్థాలు తీసుకోవాలి. అలాగే మెంతులు రాత్రి సమయంలో నీళ్ళలో నానబెట్టి పొద్దునే ఆ నీళ్లు తాగితే రాళ్లు జరుగుతాయి. అరటి చెట్టు బెరడు తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన ద్వారా రాళ్లు కరిగి బయటికి వచ్చేస్తాయి. కొత్తిమీర జ్యూస్‌ రోజు తీసుకోవడం మంచిది.
Also Read : Tips For Sinusitis : సైనస్ ని తగ్గించే ఇంటి చిట్కాలు

చివరిది అతి ముఖ్యమైన సలహా. అయితే వానకాలంలో విరివిగా లభించే నేరేడు పళ్ళు తినడం వల్ల కిడ్నీల్లో ఎంత పెద్ద రాలు ఉన్న దెబ్బకు కరిగి కింద పడిపోతాయట. నేరేడు పండ్లను రోజుకు ఒక‌టి చొప్పున తింటే మూత్ర‌పిండాల్లో రాళ్లు క‌రిగిపోతాయి. జీర్ణాశ‌యంలో ఉండే రాళ్లు, వెంట్రుక‌లు కూడా నేరేడు పండ్లతో క‌రిగిపోతాయి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో ఉండే రాళ్ల‌ను చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు.

Exit mobile version