Site icon NTV Telugu

Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి

Kidney

Kidney

Kidney Racket Case: హైదరాబాద్ మహానగరంలోని అలకనంద హాస్పిటల్ లో జరిగిన కిడ్నీ ఉదాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోజురోజుకీ ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిడ్నీ రాకెట్ కు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదివరకు కేసుకు సంబంధించి కిడ్నీలు ఇచ్చినవారు, కిడ్నీలు తీసుకున్నవారు లభించగా హాస్పిటల్ ని ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత కిడ్నీ ఆపరేషన్లు చేసిన డాక్టర్లకు సంబంధించి కూడా సెర్చ్ ఆపరేషన్ జరిగినా.. చివరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజా సమాచారం మేరకు గత ఆరు నెలల్లోని 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Samantha: సినిమాలు తగ్గించడానికి కారణం ఇదే.. మొత్తానికి బయట పడిన సమంత

వైజాగ్ చెందిన డాక్టర్ రాజశేఖర్ చుట్టూ ఈ కథ తిరుగుతోంది. ఇదివరకు కూడా రాజశేఖర్ వైజాగ్ కిడ్నీ రాకెట్ కేసులో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత కిడ్నీ రాకెట్ సంబంధించి డాక్టర్ రాజశేఖర్ హైదరాబాదులో మూడు ఆసుపత్రులను ఉపయోగించాడు. ఇందులో భాగంగా హైదరాబాదులోని జనని ఆసుపత్రిలో మొదట 60 కిడ్నీ ఆపరేషన్లు చేయగా.. ఆ విషయం కాస్త లీక్ కావడంతో ఆ ఆసుపత్రిని మూసివేశారు. ఆ తర్వాత అవని హాస్పిటల్ లో 20 కిడ్నీ ఆపరేషన్లు చేశారు. ఆ ఆసుపత్రి తర్వాత నెల రోజుల్లో అలకనంద ఆసుపత్రిలో 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లుగా సమాచారం. ఈ ఇల్లీగల్ పనిలో ముగ్గురు రోగులు కూడా మరణించారని తెలుస్తోంది. ఈ విషయం ఇల్లీగల్ కావడంతో ఈ విషయాన్ని రోగుల బంధువులు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. ఈ ఆపరేషన్ కు 45 నుంచి 60 లక్షల వరకు సొమ్మును వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన కొందరు డాక్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ను నడుపుతున్నారు. ఈ డాక్టర్లు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని డబ్బు అవసరం ఉన్న వారిని ఉచ్చులోకి దింపి కిడ్నీలను దోచేస్తున్నారు.

Exit mobile version