మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవినాష్ రెడ్డి కిడ్నాప్ కలకలం, మేడిపల్లి శివారులో ఉంటున్న అవినాష్ రెడ్డి తన క్లాస్మేట్ అయిన అన్షిత రెడ్డి కొన్ని సంవత్సరాలు సాఫీగా సాగిన ప్రేమ వ్యవహారం , డబ్బులు కావాలని ప్రియుడు అవినాష్ రెడ్డి ని అడగడంతో ప్రియురాలి కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న అన్షితా , అవినాష్ రెడ్డి కి దూరంగా ఉంటూ మరో ప్రేమాయణం మొదలు పెట్టింది, సిద్దిపేట్ భారతీయ జనతా పార్టీ నాయకులు చక్రదర్ గౌడ్ తో పలుమార్లు అవినాష్ రెడ్డి కి ఫోన్ ద్వారా మాట్లాడుపించిన అన్షిత, అవినాష్ దగ్గర ఉన్న ఫోటోలు , వీడియో లు తొలగించాలని లేని పక్షంలో అవినాష్ కు ఇవ్వల్సిన డబ్బులు ఇవ్వమని బెదిరించాడు.
చక్రధర్ గౌడ్, ఫోన్లో మాట్లాడేది ఉంది డీల్ పూర్తి చెద్దం అంటూ మెసేజ్ పెట్టిన చక్రధర్ గౌడ్, ఘట్కేసర్ లోని వరంగల్ హై వే పై ఉన్న వందన హోటల్ వద్ద కు రమ్మని చెప్పటంతో, నమ్మి డబ్బుల కోసం పోయిన అవినాష్ రెడ్డి ని కారులోకి కూర్చోమని మాట్లాడిన చక్రధర్, తన అనుచరులతో దాడి చేసి కిడ్నాప్ కు విశ్వ ప్రయత్నం చేశారు. సినిమా తరహాలో రెక్కీ నిర్వహించి అన్షిత రెడ్డి తో సహజీవనం చేస్తున్న చక్రధర్ పై పోలీసుల కు ఫిర్యాదు చేశాడు బాధితుడు అవినాష్. ఘట్కేసర్ వరంగల్ హై వే పై ఉన్న వందన హోటల్ వద్ద చక్రధర్ గౌడ్ కిడ్నాప్ స్కెచ్.. కిడ్నాపర్ల నుండి తప్పించుకుని పోలీసుల ను ఆశ్రయించిన అవినాష్ రెడ్డి. స్థానికంగా ఉన్న ప్రజలు వెంట పడటంతో బుల్లెట్ బండి వదిలేసి పరారయ్యారు దుండగులు.
