NTV Telugu Site icon

Kid Climb Mount Everest: బుడిబుడి అడుగులతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేసిన రెండున్నరేళ్ల చిన్నారి..!

9

9

ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ఈ శిఖరాన్ని అధిరోహించాలంటే అంత ఆషామాసి విషయం కాదు. అక్కడి వాతావరణాన్ని తట్టుకొని, వాతావరణ పరిస్థితులను అధిగమించి ముందుకు సాగాలి. ఉష్ణోగ్రతల ఎగుడుదిగుడులను గ్రహించి ముందుకు సాగడం పెద్దవారికె పెద్ద సమస్య. అలాంటిది ఓ రెండున్నర ఏళ్ల చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. సిద్ధి మిశ్రా అనే చిన్నారి భారతదేశంలోని అతి చిన్న వయసులోనే ఎవరెస్టు పర్వత బేస్ క్యాంపు పైకి ఎక్కిన చిన్నారిగా రికార్డు ఎక్కింది.

Also read: Pawan Kalyan: మూడు రోజుల్లో జనంలోకి జనసేనాని..

బుడిబుడి అడుగులు వేస్తున్న ఈ చిన్నారి ఎవరెస్టు అధిరోహించడం సాహసంతో కూడుకున్న పని. అయితే సోషల్ మీడియాలో ఈ పాప చేసిన పనికి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. చిన్నారి తల్లి భావన దేహరియతో కలిసి ఆ చిన్నారి పది రోజులలో 53 కిలోమీటర్ల దూరం పూర్తి చేసి వారి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయంపై తల్లి మాట్లాడుతూ.. తమ కుమార్తెతోపాటు ఎవరెస్టు అధిరోహించడంపై సంతోషం వ్యక్తం చేసింది. కాకపోతే ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘భేటీ బచావో.. బేటి పడావో’ కార్యక్రమానికి ఈ విషయాన్ని అంకితం చేశారు.

Also read: Vemulawada: నేటి నుంచి ఐదు రోజుల పాటు వేములవాడలో శివ కళ్యాణ మహోత్సవాలు..

ఇకపోతే ఈ సంవత్సరం జనవరి నెలలో స్కాట్లాండ్ దేశానికి చెందిన రెండేళ్ల చిన్నారిని తన తండ్రి మోస్తూ పర్వతారోహణ చేశారు. అంతేకాదు 2023 అక్టోబర్​ 25 లో బ్రిటన్ దేశానికి చెందిన రెండేళ్ల టాట్ కార్టర్ కూడా ఎవరెస్ట్ ఎక్కి అందర్నీ ఆశర్యపరిచాడు. దాంతో ఆ పిల్లోడు అత్యంత చిన్న వయసులో పర్వతారోహకునిగా టైటిల్ దక్కించుకొని ప్రపంచం దృష్టి తన వైపు తిప్పుకున్నాడు.