Kick : రవితేజ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న కిక్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. ఈ మూవీని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నించారు.కానీ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండటం.. థియేటర్ల కొరత ఏర్పడటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. మేకర్స్ ను నిర్మాత మండలి కాంప్రమైజ్ చేసి సోలో రిలీజ్ డేట్ ను ఇచ్చింది.దీంతో ‘ఈగల్’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.దీనితో ‘ఈగల్’ మూవీ కోసం రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు మరో కిక్కిచ్చే వార్త అందింది. రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన ‘కిక్’ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది.
టాలీవుడ్ లో కొన్నాళ్లుగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు మరియు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వారి సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న రవితేజ పుట్టిన రోజు జరిగిన విషయం తెలిసిందే. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెస్ తెలిపారు. రవితేజ కూడా ‘థ్యాంక్యూ తమ్ముళ్లూ’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక ఆయన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగానే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ‘కిక్’ను రీరిలీజ్ చేయబోతున్నారు. మార్చి 1న ఈ చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది.కిక్ మూవీ రవితేజ కెరీర్ లోనే స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ అదిరిపోతుంది.కిక్ మూవీ మరోసారి థియేటర్స్ లోకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే రవితేజ ఈగల్ మూవీ తరువాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేనితో RT4GM, అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!