NTV Telugu Site icon

Kiccha Sudeep: బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకికాదు..

Kiccha Sudeep

Kiccha Sudeep

Kiccha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు.. సీఎం బసవరాజ్‌ బొమ్మైతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత పలు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.. ఇక, ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆసక్తికర కామెంట్లు చేశారు.. నేను సీఎం బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకి కాదని స్పష్టం చేశారు.. అయితే, నేను స్టార్ కంపెయినర్ గా వెళ్లినంత మాత్రాన ఎవరూ ఓట్లు వేయరు, పౌరులుగా ప్రతిఒక్కరు బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.. ఉదయం వరకు 21 శాతం పోలింగ్‌ నమోదు అయిందంటే షాకింగ్‌గా ఉందన్న ఆయన.. అందరూ ముందుకు రావాలి… ఓటు హక్కు వినియోగించుకోవానలి సూచించారు.

నాకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలేదని మరోసారి స్పష్టం చేశారు కిచ్చా సుదీప్.. దశాబ్దాల కాలంపాటు నటుడిగానే ఉండలనుకుంటున్నానని తెలిపారు.. రాజకీయాల్లోకి వచ్చే అనుభవం, ఆలోచన లేదన్నారు.. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశా.. ప్రతిఒక్కరు ఓటు హక్కు ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.. నేను సమాజానికి సందేశాలు ఇవ్వను, ఎవరి బాధ్యత ఆళ్లు నిర్వర్తించాలన్నారు.. ఓటు ఎంతోమంది భవిష్యత్ ను నిర్దేషిస్తుంది.. ఓటు వేయానివాళ్లు దాని ఫలితాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు కిచ్చా సుదీప్..

కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. ఈ నెల ప్రారంభంలో, సుదీప్ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. నేను ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు, మరియు నేను ఇక్కడకు ఏ ప్లాట్‌ఫారమ్ లేదా డబ్బు కోసం ఇక్కడకు రాలేదు, నేను ఇక్కడకు కేవలం ఒక వ్యక్తి కోసం వచ్చాను, నాకు సీఎం అమ్మ (బొమ్మై) అంటే చాలా గౌరవం. అందుకే బొమ్మై సార్‌కి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను అని ప్రకటిస్తున్నాను. ఒక పౌరుడిగా, ప్రధాని మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను నేను పూర్తిగా గౌరవిస్తాను, కానీ, ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి దానితో సంబంధం లేదని వ్యాఖ్యానించిన విషయం విదితమే.