NTV Telugu Site icon

KIA: అకస్మాత్తుగా 1,380 కార్లను రీకాల్ చేసిన కియా.. ఏమైందో తెలుసా?

Kia Ev6

Kia Ev6

దక్షిణకొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా ఇండియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ను రికాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 1,380 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్లను 3 మార్చి 2022, 14 ఏప్రిల్ 2023 మధ్య తయారు చేసిన కార్లను రికాల్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి సమాచారం అందించింది. ప్రస్తుతం కస్టమర్లను సంప్రదిస్తోంది. రీకాల్ చేయడానికి కారణాన్ని కంపెనీ వెల్లడించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU) సాఫ్ట్‌వేర్‌ను నవీకరించనుంది. ఇది 12V సపోర్టు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్, పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ రీకాల్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ యత్నిస్తోంది. 2025లో తయారైన మోడళ్లను కంపెనీ రీకాల్ చేయలేదు.

EV6 ప్రత్యేకతలివే..

* కియా ఇండియా.. 2022లో EV6 పేరుతో తొలి ఎలక్ట్రిక్‌ కారును భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది.
* ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు.
* 350కిలోవాట్‌ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లోనే 80శాతం ఛార్జింగ్‌ అవుతుంది. 150 కిలోవాట్‌ ఛార్జర్‌ అయితే 40 నిమిషాల్లోనే 80శాతం ఛార్జింగ్‌ అవుతుంది.
* ఆల్‌ వీల్ డ్రైవ్‌ సిస్టమ్‌, సన్‌రూఫ్‌, మల్టిపుల్‌ డ్రైవ్‌ మోడ్స్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ అవైడెన్స్‌ అసిస్ట్‌ వంటి 60కి పైగా ఫీచర్లున్నాయి.
* ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ముందు, వెనుక పార్కింగ్‌ సెన్సర్లు, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ వంటి సదుపాయాలున్నాయి.
* దీనిలో 77.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది.
* ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్‌లో సింగిల్‌ మోటార్‌ ఉంటుంది. ఇది 226 హార్స్‌పవర్‌, 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
* ఏడబ్ల్యూడీ వెర్షన్‌లో డ్యుయల్‌ మోటార్‌ సెటప్‌ ఉంటుంది. ఇవి 320 బీహెచ్‌పీ పవర్‌, 650 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు.