NTV Telugu Site icon

Khushboo: ఖుష్బూకి గాయం.. అసలేమైంది?

Khushboo

Khushboo

Khushboo: కుష్బూ.. ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో దక్షిణాది భాషలలో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన తర్వాత.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈమె నటనకు తమిళనాడులో అభిమానులు ఆమెకు గుడికట్టి ఆరాధిస్తున్నారు కూడా. అంతలా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తూ.. మరోవైపు సినీ నిర్మాతగా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. తన భర్త సుందర్ నటించి దర్శకత్వం వహించిన అరణ్మనై 4 చిత్రానికి ఆవిడ నిర్మాతగా వ్యవహరించి ఏకంగా వంద కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టారు. ఇంకోవైపు ఆమె రాజకీయాల్లో కూడా బిజీబిజీగా గడిపేస్తోంది.

Nobel Peace Prize : గాజా దురాగతాలు చూపిన నలుగురు జర్నలిస్టులకు నోబెల్ ప్రైజ్ ?

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఆమె గాయపడినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి కుష్బూ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఫోటోను పంచుకుంటూ విషయాన్ని తెలిపింది. ఈ ఫోటోలో ఆమె కాళ్ళకి కట్టుతో కనిపించింది. దాంతో ఆమెకి ఏం జరిగింది..? ఆ గాయానికి కారణాలేంటి..? అసలు ప్రమాదం ఎలా జరిగిందంటూ..? అనేకమంది సినీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన చాలామంది సోషల్ మీడియా వీడియో వినియోగదారులు ఆవిడ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో బిజెపి పార్టీతో కలిసి ఆవిడ కీలకంగా పనిచేస్తున్నారు.

Show comments