Site icon NTV Telugu

World Cup: భారత్‌లో మరో వరల్డ్ కప్.. ఇదే మొదటిసారి!

Kho Kho World Cup

Kho Kho World Cup

First Kho Kho World Cup in India: మరో వరల్డ్ కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ‘ఖో ఖో వరల్డ్ కప్’ వచ్చే ఏడాది భారతదేశంలో జరుగనుంది. 2025లో ఖో ఖో ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ భారత్‌లో జరుగుతుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఖో ఖో ఫెడరేషన్ సంయుక్తంగా బుధవారం ప్రకటించాయి. 24 దేశాలు, ఆరు ఖండాల నుండి.. 16 పురుష, 16 మహిళా జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొననున్నాయి.

Also Read: Tecno POP 9 Price: 10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌.. బెస్ట్ కెమెరా, బిగ్ బ్యాటరీ!

ఖో ఖో పుట్టినిల్లు భారత్ అన్న విషయం తెలిసిందే. బురదలో ప్రారంభమైన ఈ క్రీడ.. నేడు మ్యాట్ మీదకు వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా 54 దేశాలు ఖో ఖో ఆడుతున్నాయి. 2032 ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యమని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీ సుధాన్షు మిట్టల్ అన్నారు. ‘మొదటి ఖో ఖో ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ టోర్నమెంట్ కేవలం పోటీకి సంబంధించినది కాదు.. అన్ని దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడం. ఖో ఖో గొప్పతనాన్ని ప్రపంచానికి చూపాలి. 2032 నాటికి ఖో ఖోను ఒలింపిక్ క్రీడగా గుర్తించడమే మా అంతిమ లక్ష్యం. అందుకు ఈ ప్రపంచకప్ తొలి అడుగు’ అని సుధాన్షు తెలిపారు.

Exit mobile version