NTV Telugu Site icon

Sports Festival : హైదరాబాద్ లో స్పోర్ట్స్ ఫెస్టివల్.. దేశ వ్యాప్తంగా ఖేలో భారత్ ప్రోగ్రాం..

Laxman

Laxman

హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ విక్టరీ క్రీడా మైదానంలో ఖేలో భారత్ – జీతో భాగ్యనగర్ హైదరాబాద్ పార్లమెంట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను బీజేపీ
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్సరాజ్ గంగారాం అహిర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. స్పోర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకల్లో పలువురు బీజేపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో ఓల్డ్ సీటీలో క్రీడలు నిర్వహిస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని మోడీ కలలను సాకారం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.

Also Read : Geomagnetic storm: భూమి వైపు దూసుకొస్తున్న ప్రమాదం.. వలస పక్షులు, శాటిలైట్లపై ప్రభావం

ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఖేలో ఇండియా పేరుతో దేశ వ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తున్నామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలకు భరోసా కల్పించేందుకు ఎంపీ లక్ష్మణ్ ఇక్కడ క్రీడలు నిర్వహిస్తున్నారు అని పేర్కొన్నారు. చదువుల్లో ర్యాంకులే కాదు క్రీడల్లోనూ రాణించాలి అని బండి సంజయ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ క్రీడా రంగాన్ని విస్మరిస్తే.. ప్రధాని మోడీ మాత్రం పెద్ద పీఠ వేశారని టీ.బీజేపీ చీఫ్ గుర్తు చేశారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండదు.. తెలంగాణలో మాత్రం లిక్కర్, లీకులు నడుస్తున్నాయని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : RCB vs MI: రప్ఫాడిస్తున్న ఆర్సీబీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

ఖేలో ఇండియా పేరుతో నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా క్రీడలు నిర్వహించాలని ఎంపీలను ఆదేశించారు అని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్సరాజ్ గంగారాం అహిర్ తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ, భాగ్యనగర్ కు గర్వ కారణం అని ఆయన వెల్లడించారు. క్రీడలు మానిసిక దృఢత్వాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్సరాజ్ గంగారాం అన్నారు. నరేంద్ర మోడీ ఖేల్ ఇండియా పేరుతో క్రీడాకారులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తున్నారు అని తెలిపారు. మేము ఇప్పుడు టెర్రరిస్టులు, పాకిస్థాన్, బంగ్లాదేశ్ పై పోరాడుతున్నామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్సరాజ్ గంగారాం పేర్కొన్నారు.