NTV Telugu Site icon

Congress: సీడబ్ల్యూసీ పై ఖర్గే నజర్.. తెలంగాణ నుంచి ఒకరికి ఛాన్స్..?

Karge

Karge

హస్తం పార్టీలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్ వ్యవస్థీకరణపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నజర్ పెట్టారు. ఈ సంవత్సరం డిసెంబర్‌లోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండటంతో.. పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో సీడబ్ల్యూసీ నియామకాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Also Read : Shilpa Shetty: లేటు వయసులో తగ్గని గ్లామర్‌.. సెగలు పుట్టిస్తున్న శిల్పా శెట్టి

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన పార్టీ మూడు రోజుల ప్లీనరీలో, వర్కింగ్‌ కమిటీ సభ్యులందరినీ నామినేట్‌ చేసేందుకు పార్టీ అధ్యక్షుడికే పూర్తి అధికారం ఇవ్వాలని స్టీరింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా కుల, ప్రాంత, రిజర్వేషన్‌ల ప్రాతినిధ్యం ఆధారంగా సభ్యుల ఎంపికను మొదలుపెట్టినట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read : Mokshagna : మోక్షజ్ఞ మొదటి సినిమా ను తెరకెక్కించబోతున్న ఆ సెన్సేషనల్ డైరెక్టర్…?

రాయ్‌పూర్‌ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు సీడబ్ల్యూసీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, 50 ఏళ్లలోపు యువకులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో వీటి ఆధారంగా ఇప్పటికే కొందరి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు టాక్. రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ లిస్ట్‌పై చర్చలు చేసి వచ్చే నెలలో తుది ప్రకటన చేస్తారని తెలుస్తుంది.

Also Read : Lifestyle : వర్షాకాలంలో బైక్ పై వెళ్ళేవాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

ఇక సీడబ్ల్యూసీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది చివరన జరుగనున్న ఎన్నికల దృష్ట్యా తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందని ఏఐసీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. బీజేపీ పార్టీలో అత్యున్నత పార్లమెంటరీ బోర్డుతో పాటు, కేంద్ర ఎన్నికల కమిటీలో సీనియర్‌ నేత కె.లక్ష్మణ్‌కు ఆ పార్టీ అవకాశం ఇవ్వడంతో.. మరోపక్క పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు.

Also Read : Blood Donor Day: నేడు వరల్డ్ బ్లడ్‌ డోనర్‌ డే.. అరుదైన బ్లడ్‌ గ్రూపులివే..

తెలంగాణ నేతలకు బీజేపీ ఇచ్చిన ప్రాధాన్యత.. మాదిరే రాష్ట్ర నేతలకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీడబ్ల్యూసీలో ప్రాధాన్యమిస్తుందని అందరు భావిస్తున్నారు. ఒకవేళ చోటు కల్పించాలని నిర్ణయిస్తే షార్ట్‌లిస్ట్‌లో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్లు ఉండే ఛాన్స్ ఉంది. గత పదేళ్ల కింద తెలంగాణ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు సీడబ్ల్యూసీలో సభ్యునిగా ఉండగా, ఆ తర్వాత రాష్ట్రం నుంచి కొత్త సభ్యుడిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.