కేరళలో జరిగే దక్షిణ భారత స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఖమ్మం త్రివేణి పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్మల్ జిల్లా కొండాపూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో గైడ్ టీచర్ రోశయ్య సహకారంతో డార్విన్ బాలాజీ అనే విద్యార్థి స్మార్ట్ హెల్మెట్‌ను రూపొందించి ద్వితీయ బహుమతి సాధించినట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేరళలో దక్షిణ భారత స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేయబడింది.
Also Read : Makara Jyothi 2023: శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన గిరులు
ఈ స్మార్ట్ హెల్మెట్ ను బైక్ నడిపేవారు ధరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరిస్తే హెల్మెట్‌లోని సెన్సార్ల ద్వారా బైక్‌కు సమాచారం వెళ్తే బైక్ స్టార్ట్ అవ్వదు. ఇది నేటి సమాజానికి చాలా ఉపయోగకరమైన గాడ్జెట్ అని వీరేంద్ర చౌదరి అన్నారు. అదేవిధంగా, బైక్ రైడర్ డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతే, సెన్సార్లు అతన్ని అప్రమత్తం చేస్తాయి లేదా బైక్ ఇంజిన్‌ను ఆపివేస్తాయి. విద్యార్థి బాలాజీ అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు.
Also Read : Kishan Reddy: తండ్రిని అడ్డుపెట్టుకుని కేటీఆర్‌లా మంత్రిని కాలేదు.. కష్టపడి పైకి వచ్చాం..