ఖమ్మం మాజీ ఎంపీ పోంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలను ఖమ్మం జిల్లా పోలీసుల అధికారుల సంఘం ఖండించింది. ఖమ్మంలో మాజీ ఎంపి పోంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం నాడు జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పోలీసుల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడటం సరికాదని దీనిని పోలీసులు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. శాంతభద్రత పరిరక్షణలో మా ప్రాణాలను పణంగా పెట్టి బాధ్యతయుతమైన విధులు నిర్వహిస్తున్న పోలీసులను తమ మెప్పు కోసం పోలీసులను చులకన చేసి విమర్శలు చేయడం తగదని అన్నారు.
Also Read : Lawrence Bishnoi : ఎన్ఐఏ విచారణలో లారెన్స్ సంచలన విషయాలు.. టార్గెట్ నం.1 సల్మాన్ ఖానేనట
తెలంగాణ పోలీసు అంటే దేశంలోనే మంచి గుర్తింపు ఉందిని,..ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల ఆధారాభిమానులు పొందుతుంటే… ఏలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, కించపరిచేలా అవాస్తవమైన అబండాలు మోపుతూ.. పోలీసులుపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అనే విషయాన్ని ఆలోచించాలన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మేము చట్టానికి, న్యాయ స్థానాలకు లోబడి పనిచేస్తాం తప్పా బెదిరింపులకో,ఇంకేవరి దగ్గరికో ఫైళ్లు పట్టుకుని వెళ్లి ప్రాధేయపడాల్సిన అవసరం పోలీసులకు లేదన్నారు. భవిష్యత్ లోనైన పోలీస్ వ్యవస్థను విమర్శించే ప్రక్రియను మానుకోవాలని సూచించారు.
Manipur: మణిపూర్‌లో మరోసారి హింస.. చర్చికి నిప్పుపెట్టిన దుండగులు