NTV Telugu Site icon

Nama Nageswara Rao: కాంగ్రెస్కి అధికారం ఇచ్చినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు..

Nama

Nama

బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అశ్వారావుపేట అసెంబ్లీలో బీఆర్ఎస్ కు తిరుగులేదన్నారు.. ఇక్కడ కృష్ణార్జునులలా మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు గొప్పగా పని చేస్తున్నారు అని తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ అశ్వారావుపేట నుంచే వచ్చింది.. ఇప్పుడు కూడా అదే పునరావృతం కావాలి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేసవి రాక ముందే నీటి ఎద్దడి నెలకొంది.. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల పంటలు దెబ్బ తిన్నాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఎప్పుడూ గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునే వారు.. ఆ విధంగానే సంక్షేమ పథకాలు కూడా ప్రవేశ పెట్టారు.. దేశంలో ప్రతీ ఇంటికి నల్లా నీరు ఇచ్చిన రాష్ట్రం ఏదని పార్లమెంట్ లో నేను ప్రశ్నిస్తే తెలంగాణ అని సమాధానం వచ్చింది అని నామా నాగేశ్వరరావు అన్నారు.

Read Also: Arvind Kejriwal: తాను జైల్లో ఉన్న ఢిల్లీ ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదు.. కేజ్రీవాల్ సందేశాన్ని తెలిపిన భార్య..!

అదే విధంగా వరి ఎక్కువ పండించే రాష్ట్రం ఏదంటే అక్కడ కూడా తెలంగాణనే ముందుంది.. ఈ ఘనత కేసీఆర్ దే అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టినందుకు గ్రామాల్లో ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.. సర్వరోగ నివారిణిలా ప్రతీదానికీ డిసెంబర్ 9ని చూపెట్టారు. డిసెంబర్ దాటి 4 నెలలు అయ్యింది.. హామీలు అమలు చేయడం చేతగాక ఇప్పుడు కొత్త పాట మొదలెట్టారు.. అత్యధిక ఎంపీలు కట్టబెట్టండి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అంటున్నారు.. గత పార్లమెంట్ లో తెలంగాణ తరపున గళమెత్తింది ఒక్క బీఆర్ఎస్ పార్టీనే.. తెలంగాణ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో లెవనెత్తాలంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అభివృద్ధి జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి దీవించాలి.. ఖమ్మం జిల్లాలో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.. కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించేది ఒక్కటే.. బిడ్డా బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఆగమాగం చేస్తామని నామా నాగేశ్వరరావు హెచ్చరించారు.