NTV Telugu Site icon

Khalistan: భారత ఎంబసీని మూసేయండి.. కెనడాలో ఖలిస్థాన్ గ్రూప్ హెచ్చరిక

Kha

Kha

Khalisthan Group Warning to Bharat: కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసి వేయాలని హెచ్చరికలు జారీ చేసింది  ఖలిస్థాన్ గ్రూప్.  జీ 20 సదస్సుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంకా ఢిల్లీలో ఉండగానే ఖలిస్థాన్ గ్రూప్ ఇంతటి దుశ్చర్యకు పాల్పడింది.  భారతరాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేసి ప్రభుత్వ ప్రతినిధిని వెంటనే వెనక్కు పిలిపించుకోవాలని హెచ్చరించింది. లేదంటే తీవ్రపరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇలా గడిచిన 48 గంటల్లోనే కెనడా నుంచి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.

Also Read: Indian Air Force: ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించిన భారత్.. చైనా సరిహద్దుకు 46 కి.మీ. దూరం

ఖలిస్థానీ గ్రూపును అణచివేయాలని భారత్ జీ20 వేదికగా కెనడాకు సూచించింది. ఈ విషయంపై ప్రధాని మోదీ కెనడా ప్రధాని వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది వ్యక్తులు చేసిన పనులను మొత్తం దేశానికి ఆపాదించకూడదని ట్రూడో పేర్కొనట్లు సమాచారం. అయితే భారత పర్యటనలో ట్రూడో ఇబ్బందిగా ఉండటానికి మోదీ ప్రభుత్వ వైఖరే కారణమని భావించిన ఖలస్థాన్ గ్రూప్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడింది. అయితే కెనడా ఈ విషయం గురించి ఎన్నిసార్లు చెప్పినా తన వైఖరి మార్చకోకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని, ఖలిస్థాన్ గ్రూప్ రెచ్చిపోతుందని భారత్ ఆరోపిస్తుంది. భారత రాయబారికి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కెనడా ప్రభుత్వానిదే అని భారత్ ప్రభుత్వం తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జీ20 సమావేశాలకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అతని పాత విమానంలో ఇబ్బంది కలగడంతో సిబ్బందితో పాటు ఢిల్లీలోనే ఉండిపోయిన సంగతి. ఇప్పటికీ విమానం కోసం ఆయన వేచి చూస్తున్నారు. ఇంకా కెనడా ప్రధాని వారి దేశం చేరుకోకముందే ఖలిస్థాన్ గ్రూప్ ఇలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక దీనిపై ట్రూడో ఎలా స్పందిస్తారు. ఖలిస్థాన్ గ్రూప్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.