Site icon NTV Telugu

Protest At India day Parade: భారతీయ జెండాను ఘోరంగా అవమానించిన ఖలిస్తాన్ మద్దతుదారులు..(వీడియో)

Khalistanis

Khalistanis

Protest At India day Parade: కెనడాలో ఆదివారం జరిగిన ఇండియా డే పరేడ్‌ లో ఖలిస్తాన్ మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇండియా డే పరేడ్ సందర్భంగా ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ త్రివర్ణ పతాకాన్ని వారి కాళ్లకింద వేసి తొక్కిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సమయంలో కెనడియన్ పోలీసులు కూడా స్పాట్ వద్ద మూగ ప్రేక్షకుడిలా నిలబడి ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఇరువర్గాల నుంచి నినాదాలు మొదలయ్యాయి.

Kolkata Doctor Rape-Murder: సీఎం మమతా బెనర్జీకి బెదిరింపులు.. విద్యార్థి అరెస్టు!

నివేదికల ప్రకారం, భారత స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే ఆగస్టు 18న టొరంటోలోని నాథన్ ఫిలిప్స్ స్క్వేర్‌లో ఇండియా డే పరేడ్ జరిగింది. ఖలిస్తాన్ మద్దతుదారుల బెదిరింపుల కారణంగా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ఇప్పటికే నిరసనకు ప్లాన్ చేశారు. కవాతు సందర్భంగా ఇరు వర్గాల మధ్య గొడవలు కూడా జరగడంతో కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. ఐకమరోవైపు న్యూయార్క్ సిటీలో రంగరంగ వైభంగా ఇండియా డే పరేడ్‌ ను భారతీయులు జరుపుకున్నారు.

Students Died: అనకాపల్లిలో అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. నలుగురు మృతి

Exit mobile version