NTV Telugu Site icon

Weight Loss: వామ్మో.. 542 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. ఎలా సాధ్యమైందంటే..?

Weight Loss

Weight Loss

Weight Loss: సౌదీ అరేబియా నివాసి ఖలీద్ బిన్ మొహ్సిన్ షరీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 2013లో అతని బరువు 610 కిలోలు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మూడేళ్లపాటు మంచానపడ్డాడు. అధిక బరువు కారణంగా ఏ పనీ చేయలేకపోయాడు. చిన్న చిన్న పనులకు కూడా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. అతని పరిస్థితి గురించి అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు తెలిసింది. దాంతో ఖలీద్‌కు సహాయం చేయాలని రాజు నిర్ణయించుకున్నాడు. అతను ఖలీద్ కోసం 30 మంది అర్హతగల వైద్యుల బృందాన్ని అందించాడు. ఆపై అతని చికిత్స ప్రారంభించాడు. ఖలీద్‌ ను ఫోర్క్‌ లిఫ్ట్, ప్రత్యేకంగా రూపొందించిన మంచం సహాయంతో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి తీసుకెళ్లారు.

Mpox – WHO: హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO.. ఎంపాక్స్ విజృంభణ‌..

ఇక్కడ అతను గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ప్రత్యేక ఆహారం, వ్యాయామంతో విస్తృతమైన చికిత్స పొందాడు. ప్రత్యేక సంరక్షణలో ఉన్న మొదటి ఆరు నెలల్లో, ఖలీద్ తన శరీర బరువు దాదాపు సగం తగ్గాడు. ఆరోగ్యం త్వరగా మెరుగుపడేందుకు ఫిజియోథెరపీ కూడా చేశారు. వైద్యులు, ఖలీద్ సంవత్సరాల కృషి ఫలితంగా 2023 సంవత్సరం చివరి నాటికి అతని బరువు 63.5 కిలోలకు చేరుకుంది. అనూహ్యంగా దాదాపు 542 కిలోల బరువు తగ్గాడు. అయితే, బరువు తగ్గిన తర్వాత అతడి అదనపు చర్మాన్ని తొలగించడానికి అనేక శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అతని వైద్య బృందం అతనికి “నవ్వే వ్యక్తి” అని ముద్దుగా పేరు పెట్టింది.

Show comments