NTV Telugu Site icon

Khaleel Ahmed : చెప్పింది చేయకపోతే మా నాన్న బెల్టుతో చితక్కొట్టేవాడు..

Kalel Ahmed

Kalel Ahmed

ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన బైలర్లలో ఖలీల్ అహ్మద్ ఒకరు. ఐపీఎల్ 2022 వేలంలో ఏకంగా రూ. 2.52 కోట్లు పెట్టి ఖలీల్ అహ్మద్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనభవాల గురించి ఖలీల్ అహ్మద్ బయటపెట్టాడు. తనకు ముగ్గురు.. అక్కలు టోంక్ జిల్లాలో ఓ ఆస్పత్రిలో మా నాన్న కాంపౌండర్ గా పని చేసేవారు.. మా నాన్న తన పని మీద బిజీబిజీగా తిరిగేవారు.. దీంతో ఇంట్లోకి కావాల్సిన పాలు, కూరగాయాలు, వంట సామాను అంతా తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉండేదని ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు.

Also Read : Dasara: ‘దసరా’ లో సిల్క్ స్మిత పోస్టర్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?

అయితే నేను ఇవేమీ పట్టించుకోకుండా గ్రౌండ్ కి వెళ్లి ఆడుకునేవాడిని.. మా నాన్న ఇంటికి రాగానే మా అమ్మ వెళ్లి వీడు చెబితే వినడం లేదని.. ఒకటికి రెండు కలిపించి చెప్పేది.. దీంతో ఆ టైమ్ లో నేను గ్రౌండ్ లో ఉండేవాడిని.. ఇక మా నాన్న కోపంగా వచ్చేవాడు సరిగా చదవడం లేదని, కనీసం చెప్పిన పని కూడా చేయడం లేదని తన బెల్టుతో చితకబాదేవాడు. నా శరీరం మీద ఆ బెల్టు మరకలు పడేవి.. ఇక రాత్రి మా అక్కలు.. ఆ గాయాలకు మందు రాసేవారు.. మా నాన్న చిన్నతనం నుంచి నన్ను డాక్టర్ చేయాలని కలలు కన్నారు.. డాక్టర్ అయితే నా భవిష్యత్ చాలా బాగుంటుందని అనుకున్నారు. అయితే క్రికెట్ లో నేను రాణించడం మొదలెట్టాక ఆయన కూడా సహకరించడం మొదలెట్టారు.

Also Read : Kodali Nani On 2024 Elections: 2024 ఎన్నికల్లో టీడీపీకి వచ్చేవి నాలుగు సీట్లే

ఆయనకి వచ్చిన పెన్షన్ డబ్బులను కూడా నా క్రికెట్ కోసం ఖర్చు పెట్టారు. అండర్ 19 టీమ్ కి సెలక్ట్ అయ్యి.. 21 వికెట్లు తీశాను.. అప్పుడు నా ఫోటో పేపర్ లో వచ్చిందని ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు. నాకు వచ్చిన అలవెన్సులు కూడా తీసుకెళ్లి మా నాన్నకి ఇచ్చాను అంటూ ఖలీల్ తెలిపాడుజ ఇప్పటికీ ఆ క్షణాలు తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతా.. అంటూ ఖలీల్ అహ్మద్ చెప్పుకొచ్చాడు. 2016-17 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ఖలీల్ అహ్మద్, ఆ తర్వాత నాలుగు సీజన్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడాడు. 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి మారాడు. 2018 ఆసియా కప్ లో ఆడిన ఖలీల్ అహ్మద్.. టీమిండియా తరపున 11 వన్డేలు, 14 టీ20 మ్యాచ్ లు ఆడి మొత్తంగా 28 వికెట్లు పడగొట్టాడు.

Show comments