హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది. నగరంలో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్‌కు బొజ్జ గణపయ్యలు తరలివస్తున్నాయి. ఇక ఇప్పుడు అందరి చూపు ఖైరతాబాద్ గణేషుడి వైపే ఉంది. కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న నిమజ్జనం ఏర్పాట్లు.. కొనసాగుతున్న వెల్డింగ్ పనులు..
Also Read:Murder Case : గోల్డ్ వ్యాపారీ మిస్టరీ హత్య..
ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహా శక్తి గణపతి గా దర్శనం ఇచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.. అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. గణేష్ ముందు రోప్ పార్టీ తో భద్రత.. విశ్వ శాంతి మహా శక్తి గణపతి కి రెండు వైపులా దేవతా మూర్తుల విగ్రహాలు.. కుడివైపు పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి.. ఎడమ వైపు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలు.. శోభాయాత్ర ప్రారంభానికి మరో గంట పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
