హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారులన్నీ గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమయ్యాయి. గణపయ్య భక్తులు ఆటపాటలతో శోభాయాత్రాలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. నగరంలో అత్యంత విశిష్టత కలిగిన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఈ ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొనగా బడా గణేషుడు హుస్సేన్ సాగర్ కు తరలివెళ్లాడు.
Also Read:KantaraChapter1: కాంతారా -1 మలయాళ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ హీరో
గణేష్ శోభా యాత్ర కన్నుల పండుగగా జరిగింది. భగభగ మండుతున్న భానుడి ని కూడా లెక్కచేయకుండా బడా గణేష్ శోభాయాత్రలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల కోలాహలం మధ్య గణనాథుడు ఎన్టీఆర్ మార్గంలోని క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకున్నారు. అన్ వెల్డింగ్ పనుల అనంతరం ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. బై బై గణేషా అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
