Site icon NTV Telugu

KH234: కమల్ యాటిట్యూడ్ కు తగ్గ పేరు ‘తగ్ లైఫ్’.. మణిరత్నం నుంచి ఇలాంటిది ఊహించలేదే

Kamla

Kamla

KH234: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం KH234. విక్రమ్ సినిమా తరువాత జోరు పెంచిన కమల్.. ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక ఈ సినిమాను కూడా కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మద్రాస్ టాకీస్ & రెడ్ జెయింట్ మూవీస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. 36 ఏళ్ళ తరువాత ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే.. వేరే లెవెల్ అని చెప్పాలి. లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో 1987 లో నాయకన్ అనే సినిమా వచ్చింది. తెలుగులో నాయకుడు అనే పేరుతో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత దాదాపు 36 ఏళ్లు ఈ కాంబో రిపీట్ అయ్యింది.

Pawan Kalyan: బ్రేకింగ్.. జనసేనలో చేరిన మొగలిరేకులు RK నాయుడు..

ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తగ్ లైఫ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్లు ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోలో కమల్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా స్టంట్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కమల్ యాటిట్యూడ్ కు తగ్గ పేరు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు మణిరత్నం నుంచి ఇలాంటి ఒక సినిమాను ఊహించలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతో కమల్ – మణిరత్నం ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Exit mobile version