Site icon NTV Telugu

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Phone Tapping

Phone Tapping

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా విచారణ స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేపు సీజే ధర్మాసనం విచారణ జరపనుంది. హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లడయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సుమోటా పిటిషన్ గా హైకోర్టు స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఎస్ఐబి మాజీ హూ ఇస్ ది ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీతరావు, తిరుపతన్న ఫోన్ టాపింగ్ చేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

 

బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి రావడానికి పలువురు రాజకీయనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ సైతం టాప్ చేసినట్లు భుజంగరావు వెల్లడించినట్లు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక అరాదే ధర్మాసనం.. మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్ ను విచారించనుంది

Exit mobile version