NTV Telugu Site icon

Group -1 Mains : గ్రూప్‌-1 పరీక్షలపై మంత్రుల కీలక సమావేశం

Group 1

Group 1

మంత్రుల నివాస ప్రాంగణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ పాల్గొన్నారు. గ్రూప్ 1 పరీక్షలు, జీవో 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, విద్యార్థులు అందరికి న్యాయం జరిగేలా చర్యలు, ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా ఉన్నతాధికారులతో మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. రేపు గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేసే అవకాశం ఉంది.

Narudi Bathuku Natana: అక్టోబర్ 25న ‘నరుడి బ్రతుకు నటన’.. టీజీ విశ్వప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇదిలా ఉంటే.. ఈ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 31,383 మంది అర్హత సాధించారు. కాగా అందులో ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైగా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా పరీక్ష కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ద్వారా 563 పోస్టులను టీజీపీఎస్సీ భర్తీ చేయనుంది. ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

GST: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..!

Show comments