Site icon NTV Telugu

TG Police: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు..

Tg Police

Tg Police

తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో మూడు పోలీస్ కమిషనరేట్ లలో మార్పులు చేశారు అధికారులు. మూడు కమిషనరేట్ లను 12 జోన్ లుగా విభజించారు. వాటిల్లో హైదరాబాద్ లో 6 జోన్ లు, సైబరాబాద్ లో 3 జోన్ లు, రాచకొండలో 3 జోన్ లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ లో కలవనున్న శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లు ఇక పై శంశాబాద్ ఎయిర్‌పోర్ట్ సైతం హైద్రాబాద్ కమీషనరేట్ లో భాగం కానుంది.

హైదరాబాద్ లో 6 జోన్ లు

చార్మినార్ జోన్
గోల్కొండ జోన్
ఖైరతాబాద్ జోన్
రాజేంద్రనగర్ జోన్
సికింద్రాబాద్ జోన్
శంషాబాద్ జోన్

సైబరాబాద్ కమిషనరేట్ లో భారీ మార్పులు

శేరిలింగంపల్లి జోన్ .. శేరిలింగంపల్లిజోన్ లోకి మొయినాబాద్ నుంచి పటాన్ చెరు దాకా
కూకట్పల్లి జోన్ లోకి మాదాపూర్
కుత్బుల్లాపూర్ జోన్

రాచకొండ కమిషనరేట్

ఎల్బి నగర్ జోన్
మల్కాజిగిరి జోన్
ఉప్పల్ జోన్

పోలీస్ జిల్లాలుగా యాదాద్రి జిల్లా ఎస్పీ మహేశ్వరం జోన్ మారనున్నాయి. షాద్ నగర్ , చేవెళ్లను కలుపుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ గా ఏర్పాటు చేసే యోచనలో పోలీస్ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version