NTV Telugu Site icon

CM Chandrababu Security: సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు.. రంగంలోకి కౌంటర్‌ యాక్షన్‌ టీమ్‌లు

Babu

Babu

CM Chandrababu Security: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు భద్రతలో కౌంటర్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి.. మావోయిస్టుల నుంచి ముప్పు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు చేర్పులు చేశారు అధికారులు.. బయట నుంచి ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే ధీటుగా ఎదుర్కోవడానికి కౌంటర్ యాక్షన్ బృందాలు సిద్ధంగా ఉండనున్నాయి.. NSG, ఎస్ఎస్‌జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీమ్ ఏర్పాటు చేశారు.. సాధారణంగా ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ శిక్షణలో కౌంటర్ యాక్షన్ టీమ్‌లు ఉంటాయి.. ఇప్పుడు చంద్రబాబు భద్రత కోసం కౌంటర్‌ యాక్షన్‌ టీమ్‌లను రంగంలోకి దించారు.. ఏపీ సీఎం చంద్రబాబుకు మూడంచెల భద్రతలో ఉండగా.. మొదటి వలయంలో ఎన్‌ఎస్‌జీ, రెండో వలయంలో ఎస్‌ఎస్‌జీ, పర్యటనను బట్టి అక్కడి స్థానిక పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు మూడో వలయంలో ఉండనున్నాయి.. ఇక, వీరందరితో పాటు ఆరుగురు కౌంటర్‌ యాక్షన్‌ కమాండోలు సీఎం సెక్యూరిటీలో ఉండనున్నారు..

Read Also: Viral News: జవాన్‌కు తుది వీడ్కోలు పలికిన రెండు నెలల కొడుకు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Show comments