Site icon NTV Telugu

Loan App Case: లోన్ యాప్ కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు..!

Loan App

Loan App

లోన్ యాప్ కేసులో కీలక నిందితుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్ కేసులో మాస్టర్ మైండ్‌తో పాటు.. మరొక నిందితుడు అరెస్ట్ అయ్యారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. లోన్ యాప్ నిర్వాహకులు 2000 రూపాయలు అప్పుగా తీసుకొని చెల్లించలేదని ఓ వ్యక్తిని వేధింపులకు దిగారు. దీంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మ్యూల్ బ్యాంకు ఖాతాలు సేకరించి చైనీస్ నేరగాళ్లకు సహకారం చేస్తున్న కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఇప్పటికే ఈ కేసులో 16 మందిని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 61 బ్యాంకు బ్యాంకు అకౌంట్లో ద్వారా లావాదేవులు జరుపుకున్నట్లుగా గుర్తించారు. చైనీస్ ఫైబర్ నేరగాలతో టెలిగ్రామ్ చాటింగ్ ద్వారా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు.

READ MORE: Varun Tej: కొరియా బయలుదేరుతున్న వరుణ్ తేజ్

కాగా.. ఇటీవల కాలంలో లోన్‌ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్‌లైన్‌ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్‌లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్‌ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. దీనిని ఎలాగైనా ఆపాలని పోలీసులు యత్నిస్తున్నారు.

READ MORE: Mysuru Suicide: ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య..

Exit mobile version