Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- మద్యం మత్తులో సియా గోయల్
- బర్త్‌డే రోజున రెచ్చిపోయిన సియా
- పొట్టి దుస్తులు ధరించి ఊగిపోయిన కిలాడీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు సంబంధించిన నేరాలు-ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా కాబోయే భర్తను చంపేసిందని మాత్రమే అనుకున్నారు. కానీ దుర్మార్గురాలి ఘోరాలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ బార్లో పొట్టి దుస్తులు ధరించి.. ఇష్టానురీతిగా ఊగిపోతూ డ్యాన్స్ చేసింది. ఓ వైపు మద్యం తాగుతూ.. ఇంకోవైపు బర్త్‌డే కేక్ కట్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సియా గోయల్‌కు మద్యం తాగే అలవాటు ఉందని తమకు ముందుగా ఆమె తల్లిదండ్రులు చెప్పలేదని కేతన్ తల్లి వాపోయింది. ఆమెకు చాలా చెడు అలవాట్లు ఉన్నాయని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను బట్టి తెలుస్తోందని పేర్కొన్నారు.
కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో నిందితులపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక విచారణలో నిందితులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సియా గోయల్‌కు సంబంధించిన మద్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బార్లో పొట్టి దుస్తులు ధరించి.. విపరీతంగా డ్యాన్స్ చేసింది. అంతేకుండా ఓ వైపు మద్యం సీసా… ఇంకోవైపు కేక్ కట్ చేస్తున్న దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోతో దర్యాప్తు కొత్త మలుపునకు దారి తీసింది.
Also Read
- Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
కొన్ని గంటల క్రితం సియా తల్లి ఓ మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమార్తె ఎప్పుడూ మద్యం సేవించలేదని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సియా మద్యం తాగుతున్నట్లుగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో సియా తల్లి చెప్పింది అబద్దమన్నట్టుగా తేలిపోయింది. ఇక ఈ వ్యవహారంపై కేతన్ తల్లి మాట్లాడుతూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సియా గురించి రహస్యాలు ఎందుకు దాచారో తమకు అర్థం కావడం లేదని వాపోయింది.
ఇదిలా ఉండగా సియా, చేతన్ తమ మొబైల్ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని పూర్తిగా డిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆ సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరి మధ్య వేలాది మెసేజ్‌లు జరిగినట్లుగా సమాచారం. ఆ మెసేజ్‌లు రికవరీ చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఇద్దరికి సంబంధించిన ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఐటీ నిపుణుల నుంచి సమాచారం రాగానే నిందితులపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇక కేతన్కు విగ్గు, నత్తి ఉండడం వల్లే సియా తిరస్కరించినట్లుగా వస్తున్న వార్తలపై కేతన్ తండ్రి సీరియస్ అయ్యారు. కేతన్కు విగ్గు.. నత్తి ఉన్నట్లుగా సియాకు ముందే తెలుసని.. వారి కుటుంబ సభ్యులకు విషయాలు తెలుసని చెప్పారు. ఒకవేళ ఇష్టం లేదని తమకు చెబితే.. రద్దు చేసుకునే వాళ్లం కదా? అని అన్నారు. అయితే ఇదొక్కటే కారణం కాదని పోలీసులు కూడా చెప్పుకొచ్చారు. సియా సంకేతం ఇవ్వడంతోనే కేతన్‌ను చేతన్ చౌదరి తోసేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇక సియాకు కోటకు వెళ్లడానికి ఇష్టం లేకపోయినా కేతన్ తల్లే ఒప్పించిందని సియా తల్లి ఆరోపించింది. ఇక ఉధయ్పూర్లో రూ.17 కోట్లతో ప్యాలెస్ బుక్ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని.. కేవలం రూ.3 కోట్లేనని సియా తల్లి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!