Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మోస్ట్ అవేటెడ్ తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసకపట్నం’ అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా అండ్ రస్టిక్ పొలిటికల్ గ్యాంగ్ వార్ డ్రామా ఇది. రక్తాన్ని ఉడికించే యాక్షన్, మైండ్ గేమ్‌లు, కుటుంబ విభేదాల కలబోతగా వస్తోన్న ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈ సిరీస్‌లో వెర్సటైల్ నటుడు సముద్రఖని ‘నాయుడు’ అనే అత్యంత పవర్ఫుల్ రోల్లో నటించగా.. టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఆయన కూతురు ‘భారతి’ పాత్రలో నటించారు. ఇసకపట్నం అనే పోర్ట్ టౌన్లో రాజకీయాలు, అండర్ వరల్డ్ నేరాలు, వందల కోట్ల వ్యాపారాలపై ఏకఛత్రాధిపత్యం చెలాయించే నాయుడికి.. చివరకు తన సొంత కూతురే ఒక పెద్ద సింహస్వప్నంగా మారుతుంది.
తన జీవితాన్ని, తన ఊరిని తండ్రి గుప్పిట్లోంచి కాపాడుకోవడానికి, తండ్రి అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి భారతి తిరుగుబాటు చేయడమే ఈ సిరీస్ మేజర్ హైలైట్. ట్రైలర్లో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే డైలాగ్స్, మైండ్ గేమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ గ్యారీ బీహెచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లతో రాబోతోంది. ప్రశాంత్ రాఘతి అందించిన అద్భుతమైన కథకు, తాజుద్దీన్ సయ్యద్ రాసిన పవర్ఫుల్ సంభాషణలు తోడయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘తమడా మీడియా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సిరీస్‌లో కమెడియన్ సునీల్ సరికొత్త రోల్లో కనిపించబోతుండగా.. నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో మెరవనున్నారు.
Also Read
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
ట్రైలర్‌తోనే సిరీస్‌పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిన ‘ఇసకపట్నం’.. వచ్చే వారం జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఆడియో అందుబాటులో ఉండనుంది. అంతేకాదు, ఏకంగా 15 భాషల సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాల్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒకేసారి రిలీజ్ చేయనుంది.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!