Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- కేతన్ హత్య దర్యాప్తులో సంచలన ట్విస్ట్
- వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె యువ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు ప్రియుడు చేతన్ చౌదరితో ప్రేమ వ్యవహారం ఉందని కుటుంబ సభ్యులకు ముందే తెలిసిందని.. ఆ తర్వాతే ఆమెకు కేతన్ అగర్వాల్‌తో వివాహం నిశ్చయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. చేతన్ కుటుంబంతో పోలిస్తే కేతన్ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండటంతో ఈ వివాహాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సియా సోదరుడు సాహిల్ గోయల్ కూడా దృడపరిచాడు. పోలీసులకు కీలక వివరాలు వెల్లడించాడు. తన క్రికెట్ మ్యాచ్‌లకు సియా తరచూ వచ్చేదని.. ఆ సమయంలోనే సియాకు చేతన్ చౌదరితో పరిచయం ఏర్పడిందని వెల్లడించాడు. అనంతరం గత ఏడాది ఓ ఉమ్మడి స్నేహితుడు నిర్వహించిన దీపావళిలో ఇద్దరూ మళ్లీ కలిశారని.. అప్పటినుంచే సాన్నిహిత్యం మరింత పెరిగిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ స్టేట్మెంట్తో చేతన్ గురించి కుటుంబ సభ్యులకు ముందే తెలుసని అర్థమవుతోంది. సియా తల్లి మీడియాతో చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలుస్తోంది.
ఇక పోలీసుల కస్టడీలో జరిగిన విచారణలో సియా గోయల్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్ అంటే ఇష్టం లేదని.. అతను విగ్గు (హెయిర్ ప్యాచ్) ధరించేవాడని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లిని రద్దు చేయాలని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదని పోలీసులు ప్రశ్నించగా.. వారిని బాధపెట్టడం ఇష్టం లేక అలా చేయలేదని సియా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అలాగే కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లిని తిరస్కరించడం కంటే.. లోహగడ్ కోట దగ్గర కేతన్‌ను లోయలోకి తోసేస్తే సమస్య సులభంగా ముగుస్తుందని తాను భావించినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్‌లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్‌లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
కేతన్ తండ్రి ఆగ్రహం
ఈ ఆరోపణలపై స్పందించిన కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ వాటిని తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు పూర్తి విగ్గు ధరించలేదని.. కేవలం చిన్న హెయిర్ ప్యాచ్ మాత్రమే ఉపయోగించేవాడని చెప్పారు. ఆ విషయం నిశ్చితార్థానికి ముందే సియా కుటుంబానికి పూర్తిగా తెలుసని తెలిపారు. ‘‘హెయిర్ ప్యాచ్ వేసుకున్నాడనే కారణంతో నా కుమారుడిని హత్య చేయడం సమర్థించలేం. అది హత్యకు కారణం కాలేదు. కాలేదు కూడా.’’ అని విశాల్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
దర్యాప్తులో భాగంగా ఈ వివాహ సంబంధాన్ని కుదిర్చిన నరేంద్ర మిట్టల్‌ను కూడా పోలీసులు విచారించారు. లొనావాలా రూరల్ పోలీసులు శుక్రవారం ఆయన నుంచి వివరాలు సేకరించారు. నరేంద్ర మిట్టల్.. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్‌కు మేనమామ కాగా.. సియా గోయల్ తల్లి పూజా గోయల్‌కు బంధువు. విచారణలో ఆయన మాట్లాడుతూ.. తన పాత్ర కేవలం రెండు కుటుంబాలను వివాహ సంబంధం కోసం పరిచయం చేయడానికే పరిమితమని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!