Nani vs Chinni: అన్నదమ్ముల మధ్య వర్గపోరు బహిరంగంగానే సాగింది. తిరువూరులో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈనెల 7న చంద్రబాబు సభ ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్థానిక నేతలతో సమన్వయం చేయడానికి నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొనటానికి కేశినేని నాని, కేశినేని చిన్ని తిరువూరు వెళ్లారు. అయితే ఫ్లెక్సీలో కేశినేని నాని ఫొటో లేకపోవడంతో నాని వర్గం ఫ్లెక్సీలు చించి, కుర్చీలను విరగొట్టి ఆందోళనకు దిగింది. నియోజకవర్గ ఇంఛార్జ్ దత్తుపై కూడా నాని వర్గం ఆందోళనకు దిగింది.
Read Also: Aukat Remark: డ్రైవర్ స్థాయి గురించి ప్రశ్నించినందుకు!.. కలెక్టర్‌పై బదిలీ వేటు
ఇదిలా ఉండగా.. నాని వర్గీయులు ఫ్లెక్సీలు చించేయగా.. అందులో జనసేన అధినేత పవన్ ఫొటో ఉందంటూ జనసైనికులు నిరసనకు దిగారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.