Site icon NTV Telugu

Kesineni Nani: కేశినేని నాని సంచలన నిర్ణయం.. టీడీపీకి, ఎంపీ పదవికి గుడ్‌బై..!?

Kesineni

Kesineni

Kesineni Nani: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. త్వరలోనే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.. త్వరలో లోక్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ట్వీట్ చేశారు.. నా అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఇంకా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Read Also: MP Kesineni Nani: ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తా.. మూడోసారి ఎంపీని నేనే..

ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే..”చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన.. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను” అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.. ఇక, తన ట్వీట్‌కు చంద్రబాబు, భువనేశ్వరిలతో కలిసి తాను ఉన్న ఫొటోను షేర్‌ చేశారు కేశినేని నాని.

అయితే, క్రమంగా టీడీపీ, పార్టీ అధినేత చంద్రబాబుపై తన స్వరాన్ని మారుస్తున్నారు కేశినేని నాని.. నా అభిమానులకు క్లారిటీ ఉంది.. అధినేత చెప్పింది రామభక్త హనుమాన్‌లాగా పాటిస్తాను. నాకు నా అభిమానులకు టెలీపతీ ఉంది. తినబోతూ రుచులు ఎందుకు. ఒకళ్లు ఓడాలి.. ఒకరు గెలవాలి.. తప్పేం లేదుగా. నన్ను నమ్ముకుని వేల మంది ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు.. నేను బొమ్మసాని సభకు వెళ్ళడం లేదు. పార్టీ కార్యక్రమాలకు వద్దనే అధికారం అధినేతకు ఉంది.. కానీ, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనవద్దని అనలేరని శుక్రవారం రోజు వ్యాఖ్యానించారు కేశినేని.. పార్టీ అన్నాక అధినేతకు కొన్ని తప్పనిసరి పతిస్ధితులుంటాయి. చంద్రబాబును కూడా తప్పు అనడానికి లేదు. ఇద్దరు మాజీమంత్రులు, ఒక మాజీ ఎంపీ అబద్ధం చెపుతారా?. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాను. మూడోసారి నేను విజయవాడ పార్లమెంటు నుంచి ఎన్నిక అవుతాను అనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేసిన విషయం విదితమే.

Read Also: Kesineni Nani: పార్టీలో కేశినేని చిన్ని ఎవరు?.. ఎంపీనా, ఎమ్మెల్యేనా ?

మరోవైపు.. చంద్రబాబును, టీడీపీ నేతలను టార్గెట్‌ చేయడానికి కేశినేని నాని రాజీనామా నిర్ణయానికి వచ్చారనే చర్చ సాగుతోంది.. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కేశినేని. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నుంచి చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, వచ్చే ఎన్నికల్లో ఏదైనా పార్టీ తరపున పోటీ చేస్తారా..? లేక ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతారా అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.. ఇదే సమయంలో.. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు.. భారతీయ జనతా పార్టీలో కీలక పదవుల్లో ఉన్న పలువురు నేతలతో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. మరి ఆయన అడుగు ఎటువైపు పడతాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

కేశినేని నాని చేసిన తాజా ట్వీట్‌..

Exit mobile version