Site icon NTV Telugu

Kesineni Nani: వైసీపీలోకి కేశినేని నాని!.. సీఎం జగన్‌తో కీలక భేటీ

Kesineni Nani

Kesineni Nani

Kesineni Nani: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలయ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఆ పార్టీ నుంచి ఇటు.. ఈ పార్టీ నుంచి అటు జంపింగ్‌లు కొనసాగుతున్నాయి.. టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చు పెడుతుండగా.. మరోపార్టీ నుంచైనా పోటీకి సిద్ధపడుతున్నారు.. ఇక, ఈ మధ్య బెజవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత వచ్చింది. కుమార్తె శ్వేతతో పాటు కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. కేశినేని వెంట వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ ఉన్నారు.

Read Also: AP High Court: చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్

ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన వైసీపీలో చేరడం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి వైసీపీలో చేరికపై కేశినేని – విజయసాయి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. తిరువూరు అభ్యర్థిగా తన అనుచరుడు నల్లగట్ల స్వామి దాస్‌కు కూడా అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. కేశినేని నానికి బెజవాడ ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు వైసీపీ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి సీఎం జగన్‌-కేశినేని నాని భేటీలో ఎలాంటి చర్చ సాగిందన్న విషయం తెలియాల్సి ఉంది.

 

Exit mobile version