NTV Telugu Site icon

Kesineni Nani: గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని శ్వేతా

Kesineni Swetha

Kesineni Swetha

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడప గడపకు వెళ్తుంటే ప్రజలు నీరజనం పడుతున్నారు.. ప్రజలందరూ వైస్సార్సీపీ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద ప్రజలకు అందించిన పాలనా ఎంతో అద్భుతంగా ఉంది అన్నారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. 2019కి ముందు పవర్టీ రేటు 11 శాతం ఉండేది.. అదే ఇప్పుడు 4 శాతంగా ఉందన్నారు. కోవిడ్ ఉన్న కానీ మూడున్నర సంవత్సరాల కాలంలో 7 శాతం పేదరికన్ని తగించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని కేశినేని శ్వేత పేర్కొన్నారు.

Read Also: Viral Video : డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలి చనిపోయిన యువతి

ఇక, నాడు- నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ ని కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మార్చిన జగన్ మోహన్ రెడ్డి.. అమ్మ ఒడి వాళ్ళ పేద విద్యార్థులకు చేయూత ఇచ్చారని కేశినేని శ్వేత తెలిపారు. కేశినేని నాని గురించి ప్రతి గడపకు వెళ్తుంటే గత 10 సంవత్సరాల నుంచి విజయవాడను ఎంతో అభివృద్ధి చేసింది చెబుతున్నారని పేర్కొన్నారు. కేశినేని భవన్ ద్వారా ఎంతో మందికి పేద ప్రజల అవసరాలను, కష్టాలను తీర్చింది కేశినేని నానినే.. నానినీ విజయవాడ ప్రజలు వాళ్ళ సొంత బిడ్డగా భావిస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ఫ్లైఓవర్, హాస్పిటల్, ఎయిర్ పోర్ట్, ఇలా గత 10 సంవత్సరాల నుంచి విజయవాడకు ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లు తెచ్చిన ఘనత కేశినేని నానిది.. దశాబ్దాల కాలంలో తీరని తీర్చని సమస్యలను జగన్మోహన్ రెడ్డి తీర్చి చూపించారు అని కేశినేని శ్వేత వెల్లడించారు.

Read Also: Sunil Narine: టీమ్‌ మీటింగ్‌లకు సునీల్ నరైన్ రాడు: శ్రేయస్ అయ్యర్

ఆటోనగర్లో గత 60 సంవత్సరాల నుంచి నీటి సమస్య ఉంది అని కేశినేని నాని కూతురు శ్వేత తెలిపారు. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఆ నీటి సమస్య పరిష్కరించలేదు.. కానీ, కేశినేని నాని 6 లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్ ను నిర్మించారు.. లక్ష కుటుంబాల కార్మికులు కుటుంబాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది.. అండర్ డ్రైనేజీ సమస్యలు, చిన్నపాటి వర్షానికి రోడ్డులు నిండిపోవడం లాంటి సమస్యలను పరిష్కరించింది కేశినేని నానినే.. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ లోకల్ పర్సన్.. విజయవాడ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వాడు.. ఎంపీగా కేశినేని నానినీ, ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ ను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించాలని కేశినేని శ్వేత కోరారు.