Site icon NTV Telugu

Miracle Escape : భూమ్మీద నూకలుండడం అంటే ఇదేనేమో.. జస్ట్ మిస్

Woman Escape Bus Accident

Woman Escape Bus Accident

Miracle Escape : కేరళ రాష్ట్రంలో మిరాకిల్ జరిగింది. జస్ట్ ఇంకొక్క రౌండ్ చక్రం తిరిగినా తన తలపైనుంచి బస్సు వెళ్లేది. కొట్టాయంకు చెందిన ఓ మహిళ జీవితంలో మిరాకిల్ జరిగింది. బస్సు కిందపడినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈమె జుట్టు బస్సు చక్రంలో ఇరుక్కుపోయింది. కొట్టాయం సమీపంలోని చింగవరానికి చెందిన ఈ మహిళ పేరు కే అంబిలి… స్కూల్ బస్సులో హెల్పర్‌గా పనిచేస్తోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ చిన్నారిని దాటించే సమయంలో ఆర్టీసీ బస్సు ఈమెను ఢీకొట్టింది. దీంతో ఆమె బస్సుకింద పడిపోయింది. డ్రైవర్ వెంటనే సడెన్ బ్రేక్ వేశాడు.

Read Also: A strange Rules: ఆ ట్రైనింగ్ స్కూల్లో వింత రూల్.. బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే ఫైన్

అదృష్టవశాత్తు బస్సు ముందు చక్రం ఆమెపైనుంచి వెళ్లలేదు. అయితే జుట్టు మాత్రం చక్రంలో ఇరుక్కుపోయింది. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని మహిళకు సాయం చేశారు. ఓ బార్బర్‌ను పిలిపించారు. అతను బస్సు కిందకు వెళ్లి చక్రంలో ఇరుక్కున్న మహిళ జుట్టును కత్తిరించాడు. దీంతో మహిళ క్షేమంగా బయటపడింది. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. తాను ఇంకా బతికి ఉన్నానంటే నమ్మలేకపోతున్నానని మహిళ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయిందని చెప్పింది.

Read Also: Union Budget 2023: సామాన్యులకు శుభవార్త.. పక్కా మిడిల్ క్లాస్‌ బడ్జెట్.. వాటి మీదే సీతమ్మ ఫోకస్?

Exit mobile version