NTV Telugu Site icon

Aggressive Elephant: ఉత్సవాల ఊరేగింపులో రెచ్చిపోయిన గజరాజు

Elephant

Elephant

Aggressive Elephant: కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరుర్ పట్టణంలోని పుతియంగడి ఆలయ ఉత్సవం సందర్భంగా ఒక ఏనుగు విరుచుకుపడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐదు ఏనుగులు ఈ వేడుకలో పాల్గొన్నాయి. అయితే, ఇందులో పక్కాతు శ్రీకుట్టన్ అనే ఏనుగు ఒక్కసారిగా దూకుడుగా ప్రజలపై ఆగ్రహం చూపించింది. ఈ ఏనుగు తొండంతో ఓ వ్యక్తిని పైకి ఎత్తి పడేయడంతో అతడు పది అడుగుల దూరంలో పడ్డాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ గాయపడిన వ్యక్తిని వెంటనే అక్కడి ప్రజల సహాయంతో చికిత్స కోసం కొట్టక్కల్‌లోని మిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఆ వ్యక్తి మాతరమే కాకుండా మొత్తంగా 20 మంది దాకా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Also Read: Har Ghar Lakhpati: ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా?.. రోజుకు రూ. 85 పొదుపుతో చేతికి రూ. లక్ష పొందండి!

ఈ ఘటన పండుగ చివరి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యక్రంలో భాగంగా ఐదు ఏనుగులను బంగారు ఆభరణాలతో అలంకరించి, ఊరేగింపులో భాగంగా వీటిని ప్రవహింపజేశారు. కానీ, ఈ సమయంలో శ్రీకుట్టన్ అనే ఏనుగు ఒక్కసారిగా ప్రజలు ఉన్న పరిసరాల్లోకి వచ్చి దూకుడును ప్రదర్శించింది. ఏనుగు దూకుడు కారణంగా ప్రజలు అటు ఇటు పరుగులు తీసి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలంలో ఏనుగును నియంత్రించేందుకు మహోత్ గలిగిన వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు, రాత్రి 2.15 గంటల సమయంలో ఏనుగును పూర్తిగా నియంత్రించి, మరింత నష్టం జరగకుండా నిరోధించారు. ఇప్పటివరకు, ఈ సంఘటనపై ఎలాంటి అధికారిక నివేదిక విడుదల కాలేదు. కానీ ఈ ఘటనను చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి.

Show comments