NTV Telugu Site icon

Ganja With Students: గంజాయి అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి అధికారులను అగ్గిపెట్టె అడిగిన విద్యార్థులు

Ganja

Ganja

Ganja With Students: కేరళలోని ఇడుక్కిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థుల బృందం అనుకోకుండా గంజాయి బీడీ అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి అధికారులను అగ్గిపెట్టె అడిగిన సంఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మొదటగా విషయం విన్న అక్కడి ఎక్సైజ్ అధికారి ఆశ్చర్యపోయారు. త్రిసూర్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి టూర్‌కు వెళ్లిన ఘటన ఆదిమాలిలో సోమవారం చోటుచేసుకుంది. విద్యార్థులు పొరపాటున ఎక్సైజ్ కార్యాలయంలోకి వెళ్లి.. అగ్గిపుల్లల కోసం అధికారులను అడగ్గా, ఎక్సైజ్ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వారి వద్ద నుంచి గంజాయి, హాషీష్ ఆయిల్, నిషిద్ధ పదార్థాలను నింపిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిషేధిత పదార్థాలతో దొరికిన ఇద్దరు మైనర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు.

Read Also: Amaran : అమరన్ ఓటీటీ పార్టనర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?

అందిన సమాచారం ప్రకారం, త్రిసూర్‌లోని ఎయిడెడ్ పాఠశాలకు చెందిన మున్నర్ ట్రిప్ కు వెళ్లారు 100 మంది విద్యార్థులు. ఒక హోటల్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులు గంజాయి బీడీ కాల్చడానికి బయటకు వచ్చారు. అయితే, దానిని వెలిగించడానికి అగ్గిపుల్లలు లేకపోవడంతో.. ఎక్సైజ్ కార్యాలయం వెనుక వైపు చూసి అక్కడికి చేరుకున్నామని, అకస్మాత్తుగా అధికారులను చూడగానే ప్రమాదాన్ని పసిగట్టి బయటకు పరుగులు తీసారని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసును విచారణ చేయగా నిషేధిత పదార్థాలు బయటపడ్డాయని ఎక్సైజ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గంజాయి, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు విద్యార్థులపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యార్థులు అదుపులో తీసుకుని విచారించి సూమారు ఆరు గ్రాముల గంజాయిని సీజ్ చేసారు అధికారులు. చాలామంది పిల్లలు తొలిసారిగా గంజాయి సేవించినటు విచారణలో వెల్లడైంది.

Read Also: Gachibowli Fly Over: గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ క్లోజ్.. ఎప్పటి వరకు అంటే..

ఉపాధ్యాయులతో పాటు ఇతర విద్యార్థులను వెనక్కి పంపినట్లు అధికారి తెలిపారు. అయితే ఆ ఇద్దరు విద్యార్థుల విషయంలో వారి తల్లిదండ్రులను పిలిపించి తమ వెంట పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల సందర్శనల సమయంలో మాదక ద్రవ్యాల వినియోగం విరివిగా కనిపిస్తోంది.