Minister Ganesh Kumar: కేరళం రవాణా శాఖ మంత్రి కె.బి.గణేష్ కుమార్ వైవాహిక జీవితం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. తన భర్త మరో మహిళతో ఏకాంతంగా ఉండగా తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, ఆ సమయంలో తనను మంత్రి సిబ్బంది బంధించారని ఆయన భార్య బిందు మీనన్ బహిరంగంగా ఆరోపణలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేరళ మంత్రి గణేష్ కుమార్ తనను మానసికంగా వేధిస్తున్నారని, శనివారం కొట్టారక్కర సమీపంలోని వాలకోమ్‌లో ఉన్న వారి నివాసంలో ఆయనను ఒక మహిళతో అభ్యంతరకర స్థితిలో చూశానని మంత్రి భార్య బిందు మీనన్ మీడియా ముందు వెల్లడించారు.
READ ALSO: Medak: దేవుడా..! తాగుడుకు డబ్బులు లేవని బిడ్డను అమ్మేసిన తల్లి
అసలేం జరిగిందంటే..
బిందు మీనన్ కథనం ప్రకారం.. శనివారం ఆమె తన నివాసానికి వెళ్లినప్పుడు మంత్రి గణేష్ కుమార్ మరో మహిళతో కలిసి ఉన్నారు. ఆ దృశ్యాలను ఆమె తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. అయితే, ఆమె బయటకు వెళ్లకుండా మంత్రి సిబ్బంది అడ్డుకున్నారని, తలుపులు మూసివేసి ఆమె ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. మంత్రి అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫోటోలు తన వద్ద ఉన్నాయని ఆమె తెలిపారు. మంత్రి అనుచరులు శాంతన్, ప్రదీప్ తనను గదిలో బంధించి, ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. మాజీ డిజిపి శ్రీలేఖ సలహాతో పోలీసులకు ఫోన్ చేసినా, వారు వచ్చి ఏమీ చేయలేక వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లోపే సదరు మహిళను మంత్రి సిబ్బంది కారులో పంపేశారని అన్నారు. గత కొన్నేళ్లుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని, మంత్రికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కుమార్తె వీణా విజయన్‌కు కూడా వివరించినట్లు ఆమె వెల్లడించారు.
మంత్రి గణేష్ కుమార్ స్పందన..
ఈ ఆరోపణలపై మంత్రి గణేష్ కుమార్ స్పందించారు. తనకు ఐదుగురు కాదు, ఏకంగా 5000 మంది ప్రేయసిలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రేమించడం నేరం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. ఇది నా వ్యక్తిగత విషయం, ఇతరులకు సంబంధం లేదు” అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇవన్నీ చేస్తున్నారని, తనపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయని ఆయన కొట్టిపారేశారు. మానసిక స్థితి సరిగా లేని వారే పోలీసులకు ఫిర్యాదు చేస్తారని ఆయన తన భార్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై కెఎస్‌యూ (KSU) వైస్ ప్రెసిడెంట్ యదు కృష్ణన్ డిజిపికి ఫిర్యాదు చేశారు. మంత్రి తన భార్యపై దాడికి పాల్పడ్డారని, అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కేరళం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
READ ALSO: Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!
