NTV Telugu Site icon

Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబ్ బెదిరింపులు..

Air India

Air India

Bomb Threat: తమ టికెట్‌ను పునరుద్దరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి విమానంలో బాంబు బెదిరింపులకు పాల్పడిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ సెంటర్‌కు ఓ వ్యక్తి కాల్ చేసి కొచ్చి – లండన్ గాట్విక్ విమానంలో బాంబు పెట్టినట్లుగా వార్నింగ్ ఇచ్చాడని అధికారులు చెప్పుకొచ్చారు. విషయం తెలుసుకున్న కొచ్చి ఎయిర్ పోర్ట్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. తీవ్ర గాలింపుల తర్వాత అది తప్పుడు సమాచారం అని నిర్ధారించడంతో విమానం లండన్‌కు స్టార్ట్ అయింది.

Read Also: MLA Jagadish Reddy: బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం చట్ట వ్యతిరేకం..

ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో కాల్ చేసిన వ్యక్తి లండన్‌కు టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికుడు షుహైబ్ అని తెలిసింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇక, పోలీసుల వివరాల ప్రకారం.. షుహైబ్‌ మంగళవారం తన భార్య, కుమార్తెతో కలిసి AI 149 విమానంలో లండన్‌కు వెళ్లాల్లి.. అదే సమయంలో ఆయన కుమార్తె ఫుడ్ పాయిజనింగ్‌తో ఇబ్బంది పడుతుండడంతో టికెట్‌ను మరో రోజు రీషెడ్యూల్ చేయాలని ఎయిర్‌లైన్స్‌ను షూహైబ్ కోరారు. దానికి ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌ అందుకు నిరాకరించడంతో నిరాశ చెందిన అతడు బాంబు బెదిరింపు చర్చలకు పాల్పడ్డాని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.