NTV Telugu Site icon

Angry Elephant: ఏనుగుకు ఎదురెళ్లారు.. ఊరుకుంటుందా 8కి.మీ పరిగెత్తించి మరీ

Kerala

Kerala

Angry Elephant: గజరాజులు శాంతంగా ఉన్నంత వరకే… వన్స్ వాటికి కోపం వచ్చిందా.. బీభత్సం చేస్తాయి. అవి మనకు కనిపించినప్పుడు.. వాటి కంట మనం పడకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటూ స్టైల్ గా సెల్ఫీలకోసం ఎగబడ్డారో అంతే సంగతులు.. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ సెల్ఫీలకోసం పోలేదు కానీ గజరాజుకు మనోళ్లు కంటపడ్డారు. ఇంకేముంది 8కిలోమీటర్లు పరిగెత్తించింది. ఇప్పుడు ఇదేవీడియో వైరల్ అవుతోంది.

Read Also: Football Stadium: ఆ స్టేడియాన్ని ఎక్కడికంటే అక్కడికి మడతపెట్టి తీసుకెళ్లొచ్చు

కేరళలోని చాలకుడి నుంచి వాల్పరాయ్‌ మార్గంలో 40 మంది టూరిస్టులతో ఓ ప్రైవేట్‌ బస్సు బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ ఏనుగు ఆ బస్సుకు ఎదురు వచ్చింది. బస్సు వైపే ఆగ్రహంతో పరుగు తీయడంతో టూరిస్టులు ఆందోళన చెందారు. డ్రైవర్‌ అంబుజాక్షన్ ఆ బస్సును రివర్స్ పోనిచ్చాడు. ఏకంగా 8 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఆ ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also:Elon Musk: ఉద్యోగులనే కాదు.. ఒంట్లో కొవ్వునూ వదలట్లేదు.. ఏకంగా 13కేజీలు తగ్గిన మస్క్

‘అటవీ ప్రాంతాల మీదుగా ఎన్నోసార్లు డ్రైవింగ్ చేశా. కానీ, నా జీవితంలో ఇలాంటిది తొలి ఘటన. బస్సులో ఉన్న వారందరూ భయంతో వణికిపోయారు. బస్సును రివర్సులో తీసుకురావడం తప్ప మాకు మరో మార్గం కనిపించలేదు’ అని అంబుజాక్షన్‌ అన్నారు. ‘కబాలి’ అనే పేరుగల ఏనుగు గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలోని ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది మేలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న సఫారీ వాహనాన్ని ఏనుగు అడ్డగించి దాడి చేసింది. వాహనంలో ఉన్న టూరిస్టులు భయంతో వణికిపోయారు.