Kerala Governor: యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ (వీసీ) నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీల రాజీనామాలను కోరారు. గవర్నర్ తరపున కేరళ రాజ్ భవన్ చేసిన ట్వీట్ ప్రకారం తొమ్మిది మంది వీసీలలో ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన వారు ఉన్నారు.
Indians Missing: కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయులు మృతి
సోమవారం ఉదయం 11.30 గంటలకు రాజీనామాలు తనకు చేరాలని కూడా ఖాన్ ఆదేశించినట్లు రాజ్ భవన్ తెలిపింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటైన సెర్చ్ కమిటీ ప్రముఖ వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులకు తగ్గకుండా కమిటీని సిఫారసు చేసి ఉండాల్సిందని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజశ్రీ ఎంఎస్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజశ్రీ విషయంలో ఆమె పేరు మాత్రమే సిఫార్సు చేయబడింది. తొమ్మిది విశ్వవిద్యాలయాలు ఏమిటంటే.. కేరళ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, కొచ్చిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, కేరళ విశ్వవిద్యాలయం ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్, కన్నూర్ విశ్వవిద్యాలయం, ఏపీజే అబ్దుల్ కలాం సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం, కాలికట్ విశ్వవిద్యాలయం, తుంచత్ ఎజుతచ్చన్ మలయాళం విశ్వవిద్యాలయం.
