Site icon NTV Telugu

Kamakhya Narayan Singh: “తెలివి తక్కువ వ్యక్తి”.. ప్రకాశ్‌ రాజ్‌కు కేరళ-2 డెరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..

Kamakhya Narayan Singh

Kamakhya Narayan Singh

Kamakhya Narayan Singh: ప్రస్తుతం కేరళ-2లోని కొన్ని సన్నివేశాలపై వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ప్రకాశ్‌ రాజ్‌ ఈ సినిమాలోని బీఫ్ అంశంపై చేసిన వ్యాఖ్యలు మరొసారి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే.. ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలపై తాజాగా జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. వాస్తవానికి.. ప్రకాశ్‌ రాజ్‌ ఓ పోస్ట్‌లో 2023లో వచ్చిన ది కేరళ స్టోరీ చిత్రాన్ని పంది మాంసం కర్రీ, బీఫ్ ఫ్రై, ఫిష్ కర్రీ, వెజిటేరియన్ ఓనం సధ్య చిత్రాలతో పోల్చాడు. “నిజమైన కేరళ స్టోరీ అనేది ఇవన్నీ కలిసికట్టుగా సామరస్యంగా జీవించడం” అని వ్యాఖ్యానిస్తూ #justasking హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టు చేశాడు. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్‌ను మేధస్సు కోల్పోయిన వ్యక్తి(తెలివి తక్కువ)గా అభివర్ణించారు. బలవంతంగా బీఫ్ తినిపించడం, మత మార్పిడులు జరుగుతున్నాయా లేదా అనే విషయంపై ప్రశ్నిస్తూ.. అలా జరుగుతున్నట్లయితే దాన్ని నాగరిక సమాజం ఎప్పటికీ అంగీకరించద స్పష్టం చేశారు.

READ MORE: The Paradise: నాని కోసం రూల్స్ బ్రేక్ చేశాను.. శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ ట్వీట్!

కేరళ దేవుడి ఓన్ కంట్రీ అని తెలిపారు. తాను కేరళను టార్గెట్ చేయడం లేదని.. ఈ మత మార్పిడులనే దుష్టశక్తి వీలైనంత త్వరగా అంతం కావాలన్నదే మా కోరిక అని స్పష్టం చేశారు. తాను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అనే విషయాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ గుర్తు చేశారు. సమాజంలోని సామాజిక రుగ్మతలు, సమస్యలను ఎత్త చూపడమే తన లక్ష్యమని.. అలాంటి డాక్యుమెంటరీలు, సినిమాలే రూపొందించానని చెప్పారు. “నా సినిమాలు ఎప్పుడూ ప్రశ్నలు లేవనెత్తుతాయి. చుట్టూ ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించేలా చేస్తాయి. నేను సినిమాలు, డాక్యుమెంటరీలు తీయడానికి ముందు ఆ సమస్యను పరిశోధిస్తూ పూర్తిగా అర్థం చేసుకుంటా. ఈ సినిమాకు కూడా అంతే స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేశా” అని వివరించారు. అంతే కాదు.. ఈ సినిమాలో చూపించిన విషయాల పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఈ సినిమాలో తాము ఏమైనా తప్పుగా చూపించామని నిరూపిస్తే.. సినిమాలు తీయడమే మానేస్తానని తెలిపారు.

READ MORE: Anupama: కార్తికేయ 2 సెట్‌లో చేదు అనుభవం.. అసిస్టెంట్ చెప్పిన మాటతో అనుపమకు వాంతులు!

Exit mobile version