Kejrival: న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో మహా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన ఫైరయ్యారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్-జి ద్వారా కేంద్రానికి ప్రభుత్వాన్ని నడిపించే నియంత్రణను సమర్థవంతంగా మంజూరు చేసే కేంద్రం ఆర్డినెన్స్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read Also: Anupama : తనని ట్రోల్ చేసిన నెటిజెన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనుపమ..!!
కేంద్రం ఆర్డినెన్స్‌తో ఢిల్లీ ప్రజలను అమానిస్తోందన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఉందని ఆ ఆర్డినెన్స్ చెబుతోందంటూ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఢిల్లీని కేంద్రమే నడుపుతుందని చెబుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ..దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని..ఢిల్లీ ప్రజలు ఒంటరిగా లేరని వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నా అని కేజ్రీవాల్ చెప్పారు
Read Also: Amarnath Yatra 2023: అమర్ నాథ్ యాత్రికులు ఈ ఫుడ్ తినకుండా బ్యాన్..
అంతేకాకుండా భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు తమ వెంట ఉన్నారని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆప్ నేత మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌ల అరెస్టుల గురించి మాట్లాడుతూ..దేశ రాజధానిలో పనులు నిలిపివేయడానికే వారిని అరెస్టు చేశారన్నారు. అయినప్పటికీ తమ వద్ద వందమంది సిసోడియాలు, జైనులు ఉన్నారని, వారు తమ పనిని కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.