NTV Telugu Site icon

Mamata Banerjee : మమతా బెనర్జీతో కేజ్రీవాల్ భేటీ

Mamatha

Mamatha

ఆప్ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మంగ‌ళ‌వారం ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తో సమావేశం అయ్యారు. ఆయ‌న వెంట ఎంపీలు సంజ‌య్ సింగ్, రాఘ‌వ్ చ‌ద్దా, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి ఉన్నారు. ఈ సంద‌ర్భంగా కీల‌క అంశాల‌పై వీరు ఇరువురు చ‌ర్చించారు. ప్రధానంగా కేంద్రం ప్రభుత్వం బీజేపీయేత‌ర రాష్ట్రాలు, ప్రభుత్వాల ప‌ట్ల అనుస‌రిస్తున్న వివక్షను, కక్ష సాధింపు చర్యలపై ఈ మీటింగ్ లో చర్చించినట్లు తెలుస్తుంది.

Also Read : Devera: ఏం.. జాన్వీ పాప.. నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా..?

ప్రధానంగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు రావ‌డం ప‌ట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు. ఢిల్లీ స‌ర్కార్ కు స‌ర్వాధికారాలు ఉంటాయ‌ని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చినా.. ఆద‌రా బాద‌రాగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్భంగా అర‌వింద్ కేజ్రీవాల్ మ‌మ‌తా బెన‌ర్జీకి వివ‌రించారు. ప్రస్తుతం లోక్ స‌భ‌లో ఆమోదం పొందినా రాజ్యసభలో ఆమోదం పొందకుండా ఉండేందుకు తమకు సహకరించాలని కోరారు.

Also Read : Off The Record: సిట్టింగ్‌ ఎమ్మెల్యేని టార్గెట్‌ చేసిన సొంత పార్టీ నేతలు..!

ఇందుకు సంబంధించి పూర్తి హామీ ఇచ్చేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుముఖ‌త వ్యక్తం చేస్తుంది. మ‌రో వైపు తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ సైతం ఆప్ స‌ర్కార్ కు తమ మద్దతును ప్రకటించింది. ఈ విష‌యాన్ని స్వయంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ త‌రుణంలో జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం కేజ్రీవాల్ కు సపోర్ట్ గా నిలిచాడు. బీజేపీయేత‌ర పార్టీల‌న్నీ ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Show comments