Site icon NTV Telugu

Keerthy Suresh : మహానటి తర్వాత సినిమా అవకాశాలు రాలేదు

Mahanati

Mahanati

మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించిందని కీర్తి సురేష్. ఆ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు సైతం అందుకుంది కీర్తి సురేష్. కీర్తి కెరీర్‌లో అత్యంత పెద్ద విజయంగా నిలిచింది. సావిత్రి పాత్రలో కీర్తి నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.  సావిత్రి పాత్రలో జీవించి మెప్పించింది కీర్తి సురేష్. ఆ సినిమాతో కెరీర్ లో ఎక్కడికో వెళ్తాను అనుకున్న కీర్తి సురేష్ కు ఊహించని పరిణామం ఎదురైందట.

Also Read : Spirit : ‘స్పిరిట్’ పూజ కార్యక్రమం ముగిసింది.. ప్రభాస్ లుక్ లీక్ అయింది..?

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో  కీర్తి సురేష్ మాట్లాడుతూ ” మహానటి తర్వాత ఇండస్ట్రీలో నా మీద అంచనాలు చాలా పెరిగిపోయాయి. ఒక ప్రత్యేకమైన పాత్రల్లోనే నన్ను ఊహించడం ప్రారంభించారు. అందుకే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో నన్ను తీసుకోలేదు. నిర్మాతలు మరియు దర్శకులు నన్ను మహానటి తరహా, భావోద్వేగపూరిత పాత్రలకే పరిమితం చేసి చూడడం ప్రారంభించడంతో విభిన్న కథలు, క్రియేటివ్ పాత్రలు ఎక్కువగా రాలేదు,.  మహానటి విడుదలైన తర్వాత, నాకు 6 నెలలు సినిమా అవకాశాలు రాలేదు అంటే మీరు నమ్మరు. ఎవరూ కథ చెప్పలేదు కూడా. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను నిరాశ చెందలేదు. నా కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను రూపొందించడానికి ప్రజలు సమయం తీసుకుంటున్నారని నేను సానుకూలంగా తీసుకున్నాను. నేను ఆ గ్యాప్‌ను మేకోవర్ కోసం ఉపయోగించుకున్నాను. అవకాశలు రాలేదని ఎక్కడ వెనుకడుగు వేయక ప్రయత్నించి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది కీర్తి. ఆమె నటించిన రివాల్వర్ రీటా ఈ నెల 28న థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ గా ఉంది.

 

Exit mobile version