NTV Telugu Site icon

Keerthy Suresh Lip Lock: లిప్ లాక్‌కి ఓకే చెప్పిన కీర్తి సురేష్.. ఆ పెళ్లయిన హీరోకి పండగే!

Keerthy Suresh Lip Lock

Keerthy Suresh Lip Lock

Keerthy Suresh Lip Lock with Varun Dhawan in Baby John: సౌత్‌ స్టార్ హీరోయిన్‌లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ.. ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి చేయడంలో కీర్తి దిట్ట. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగులో దసరా, తమిళంలో సైరన్ సినిమాతో మంచి హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి వరుస ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉన్నారు.

మహనటి కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టారు. స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో ‘బేబీ జాన్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో ఆఫర్స్ రాగానే కీర్తి తన రూట్ మార్చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హాట్ షో చేస్తున్నారు. ఇప్పటివరకు బోల్డ్ సీన్స్ చేయని కీర్తి.. ఏకంగా లిప్ లాక్ సీన్స్‌లకు ఒకే చెప్పారట. బేబీ జాన్ సినిమాలో కీర్తి- వరుణ్ ధావన్‌‌ల మధ్య కొన్ని లిప్‌ లాక్ సీన్స్ ఉన్నాయట. కథ డిమాండ్ మేరకే ధావన్‌కు లిప్ కిస్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి హాట్‌ హాట్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది.

Also Read: Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. తులం బంగారంపై రూ.1900 తగ్గింది!

బేబీ జాన్ సినిమాకు తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. స్టోరీ చెప్పేముందు లిప్ లాక్ కంపల్సరీ అనే కండిషన్ కీర్తి సురేష్‌కు దర్శకనిర్మాతలు పెట్టారట. సినిమాలో లిప్ కిస్ సీన్ హైలెట్ కానుందని చెప్పారట. మొదట ఒప్పుకోని కీర్తి.. లిప్ కిస్ సీన్‌కు ఉన్న ప్రాధాన్యత తెలిసాక ఓకే చెప్పారట. బేబీ జాన్ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి ఎంత హాట్‌గా కనిపించారో ఆ రోజు తెలియరానుంది. బాలీవుడ్‌లో లిప్ కిస్ సీన్‌ సర్వసాధారణం. బాలీవుడ్‌లో రాణించాలంటే హీరోయిన్‌లకు ఇలాంటివి తప్పదు. లిప్ కిస్ సీన్ చేసేందుకు కీర్తి ఒప్పుకోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. పెళ్లయిన వరుణ్ ధావన్‌‌ అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2021లో నటాషా దలాల్‌ను వరుణ్ వివాహం చేసుకున్నాడు. ఇటీవలే నటాషా ప్రెగ్నెంట్ అని అతడు అధికారికంగా ప్రకటించాడు.

Show comments