తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు నిమజ్జనానికి తరలివెళుతున్నాడు. గణపయ్య భక్తులు డప్పు చప్పుళ్లతో, భజనలతో, ఆటపాటలతో శోభాయాత్రలో పాల్గొంటున్నారు. గణేష్ శోభాయాత్ర కన్నులపండుగగా జరుగుతోంది. ఇక వినాయక వేడుకల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది గణేష్ లడ్డూ. నిమజ్జనానికి ముదు లడ్డూ వేలం పాట వేస్తుంటారు నిర్వాహకులు. విఘ్నేషుడి లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. వినాయకుడి లడ్డూ సొంతం చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే ఐష్టైశ్వర్యాలు సిద్ధి్స్తాయని.. సుఖశాంతులు విలసిల్లుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
Also Read:Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట
చాలా ప్రాంతాల్లో లడ్డూ వేలంపాటలు కొనసాగుతున్నాయి. వేలంలో గణేష్ లడ్డూ లక్షల రూపాయలు పలుకుతున్నాయి. కాగా రంగారెడ్డి జిల్లాలో వినాయకుడి లడ్డూ సరికొత్త రికార్డును సృష్టించింది. కనీవిని ఎరుగని రీతిలో రికాడ్డు ధర పలికింది. గండిపేట మండలం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
Also Read:Viral: ప్రజా స్వామ్యానికి ముప్పుగా మారనున్న సోషల్ మీడియా..విషయమేమిటంటే..
వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలం పాట అందరి దృష్టిని ఆకర్షించింది. గతేడాది రికార్డును బ్రేక్ చేసిన కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేషుడి లడ్డు ఏకంగా కోట్లు పలికింది. ఏకంగా రూ. 2 కోట్ల 31 లక్షలు పలికింది గణేష్ లడ్డూ. కోట్ల రూపాయలు పలకడంతో చర్చనీయాంశంగా మారింది. గతేడాది గణపతి లడ్డూ ధర 1. 87 కోట్ల రూపాయిలు పలికిన విషయం తెలిసిందే.
