టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది ఈ భామ.అంతేకాదు ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది.. ఇకపోతే ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కీర్తి సురేష్ రీసెంట్ గా రిలీజ్ అయిన దసరా సినిమాతో అద్భుతమైన హిట్ అందుకుంది.ఈ సినిమాలో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కీర్తి అదరగొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా తన పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తో కీర్తి పెళ్లి జరగబోతుంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే వారిద్దరూ క్లోజ్ గా దిగిన ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి.ఇక అనిరుద్ రవిచందర్ తో కీర్తి పెళ్లి అంటూ వస్తున్న ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. కీర్తి, అనిరుధ్ పై వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం నిరాధారమైనవి. వాటిలో ఏమాత్రం కూడా నిజం లేదు. కీర్తి పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి కానీ అవన్నీ కూడా అవాస్తవాలు మాత్రమే అంటూ ఆయన ఖండించారు.ఎవరో కావాలని అనిరుధ్ , కీర్తి సురేష్ ల గురించి ఒక వార్తను క్రియేట్ చేసి దానిని ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. మరొకవైపు కీర్తి సురేష్ కూడా స్పందిస్తూ అది ఫేక్ న్యూస్…. అనిరుద్ నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఆమె తెలిపింది. ఇకపోతే అనిరుద్, కీర్తి సురేష్ మధ్య పుకార్లు రావడానికి కారణం అజ్ఞాతవాసి, గ్యాంగ్ , రెమో వంటి చిత్రాల కోసం వీళ్లిద్దరూ కలిసి పనిచేశారు. ఇటీవల ఆమె జవాన్ లోని బ్లాక్ బస్టర్ సాంగ్ చలేయా పాటకు డైరెక్టర్ అట్లీ భార్య కృష్ణప్రియ తో కలిసి డాన్స్ కూడా చేసింది. ఆ వీడియో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇలా వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండడంతో రూమర్స్ బాగా వచ్చాయి..