NTV Telugu Site icon

Kedarnath: ఈనెల 10న తెరచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

Kedarnath

Kedarnath

శివ భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ శుభవార్త చెప్పింది. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్‌ ధామ్‌ ఆలయ తలుపులు భక్తుల సందర్శనార్థం మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకుంటాయని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(బీకేటీసీ) ప్రకటించింది. ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయ వద్ద బీకేటీసీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయం వెల్లడించారు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే కేదార్‌నాథ్ ఆలయ పోర్టల్స్ శీతాకాలం మూతపడతాయి.

READ MORE: Gandhinagar: మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో బీజేపీ ఎదురు లేదు..

ఏటా పెద్ద ఎత్తున భక్తులు కేదార్ నాథ్ క్షేత్రానికి వెళ్తుంటారు. గత ఏడాది యాత్రా కాలంలో రికార్డు స్థాయిలో కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారని, ఈ ఏడాది కూడా ఈ సంఖ్య మరింత పెరగనుందని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో ప్రభుత్వం, ఆలయ కమిటీ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాయని అజయ్ తెలిపారు. త్వరలోనే ఆలయ కమిటీ బృందం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షిస్తుందని ఆయన చెప్పారు. ఓంకారేశ్వర్ ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలలో ఫ్రాంటియర్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు చండీ ప్రసాద్ భట్ పచ్‌గై, కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు ధామ్ రావల్ భీమశంకర్ లింగ్ పాల్గొన్నారు.