CM Kcr Tour: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమిపూజకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రానున్నారు. నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం, కొల్లూరులో డబుల్ బెడ్ రూం పనులకు సీఎం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, స్ధానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పటాన్ చెరులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 14వేల 32వందల కోట్లతో గృహ నిర్మాణం చేపట్టబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు పటాన్ చెరు పట్టణంలో దాదాపు రూ.185 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేసీఆర్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేసుకోవటం ఆనందదాయకమని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ ప్రాంతాలలో మల్టీపర్పస్ హెల్త్ సెంటర్ నిర్మాణం జరుగుతోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతీ జిల్లాకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు.
Read Also: Heavy Rains: మూడు రోజులు భారీ వర్షాలు..
పటాన్ చెరు నియోజకవర్గాన్ని శర వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ధగా కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించటం దారుణమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాలను చూడలేకనే కాంగ్రెస్ పార్టీ ధగా పేరుతో నిరసన చేయటానికి సన్నాహాలు చేయటం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. ప్రజలు పండుగ చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ కళ్లలో నిప్పులు పోసుకుంటుందని దుయ్యబట్టారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కుళ్లుకోవటం దారుణమని మండిపడ్డారు.
Read Also: Pawan Kalyan: నా సినిమాలు సూపర్ హిట్.. కానీ ఏపీలో 30 కోట్ల నష్టం: పవన్ కళ్యాణ్
మరోవైపు కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజీనామాలు చేసిన చరిత్ర టీఆర్ఎస్ దయితే.. రాజీపడ్డ చరిత్ర కాంగ్రెస్ ది కాదా అని ప్రశ్నించారు. ఉద్యమాల చరిత్ర టీఆర్ఎస్ దయితే.. స్వార్ధ రాజకీయ చరిత్ర మీదికాదా అంటూ కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాక ముందు వైద్యశాఖలో ఉన్న పరిస్ధితిని పూర్తిగా మార్చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పై గ్లోబల్ ప్రచారానికి దిగుతుందని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరులను అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని హరీష్ రావు ఫైరయ్యారు. ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగు విధంగా గుణపాఠం చెబుతారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.