NTV Telugu Site icon

KCR: 3 నెలల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Kcr

Kcr

వరంగల్ రోడ్డు షోలో కేసీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను కామెంట్ చేసారు. వరంగల్ జిల్లాతో నాకు విడదీయనిరాని బంధం ఉంది. ఒరుగాళ్ల పొరుగాళ్ళు అయితేనే తెలంగాణా వచ్చింది. 24 అంతస్థుల హాస్పిటల్ కట్టుకున్నాం. సీఎం అర్ధం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకపోతే వరంగల్ జిల్లాకి నీళ్లు ఎలా వచ్చింది. సీఎం ఎక్కడో కృష్ణ నది కూడా నేనే కట్టను అన్నాడు. తెలంగాణ భౌగోళికంగా గురించి రేవంత్ రెడ్డికి తెలవదు.ఇక్కడి వనరుల గురించి ఆయనకు అవగాహ లేదు. సీఎం చెప్పినట్లు.. 2లక్ష రుణ మాఫీ అయ్యింది.

Also Read: Top Headlines @ 9 PM : టాప్ న్యూస్

తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది., హైదరాబాద్ లో అనుమతులు ఇవ్వడం లేదు. Tsipass లో ఏదైనా దరఖాస్తు పెడితే వెంటనే అనుమతులు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పటి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. వేరే రాష్ట్రాల్లో ఏదైనా కంపెనీలో వస్తే డబ్బులు తీసుకుని అనుమతులు ఇవ్వడం చేస్తున్నారట అలాంటి మాటలు ఇవ్వడం లేదు. బిజెపి మోసకారి పార్టీ. మోడీ చెప్పిన ఒక హామీ అమలు కాలేదు., మన ప్రాజెక్టు ఇవ్వాల్సిన ప్రాజెక్టులను వేరే రాష్ట్రని తొలుకెళ్లి పోయారు. మనకు ఉన్న ఓకే ఓకే నదిని మహారాష్ట్రకి, తమిళనాడుకు ఎత్తుక పోతా అని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అలా లేక రాస్తే ఈ ముఖ్యమంత్రి సోయిలేదు . ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఎక్కవ సీట్లు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం.

Also Read: Robo Marraige: వేడెవండీ బాబు.. రోబోతో పెళ్లికి సిద్ధమైపోయాడు..

ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చాము. ఉప ముఖ్యమంత్రి చేశాము. కడియం శ్రీహరి చేసిన మోసానికి ఆయన శాశ్వత రాజకీయం నష్టపోబోతున్నారు. మూడు నెలల్లో కడియం శ్రీహరి తగిన బుద్ధి చెప్పబోతున్నారు. మోసం చేస్తే జరిగే శాస్తి ఏంటో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూపాలి. స్టేషన్ ఘనపూర్ కి మూడు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి ఈ ఎన్నికల్లో రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నారు అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.